చింతపల్లి, జూన్ 8: మండల కేంద్రంలో బుధవారం టిడిపి యూనిట్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని పిఏసిఎస్ పర్సన్ ఇంచార్జ్ ఎమ్మెల్యే అబ్బాయి నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి అదేశాల మేరకు ప్రతి నెల మొదటి బుధవారం నాడు యూనిట్ పరిధిలో జరిగిన సమావేశం ఈనెల రెండవ బుధవారం జరుగుతుందన్నారు. ఈ సమావేశం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు,క్లస్టర్ -5, 6 ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి గ్రామ కమిటి అధ్యక్షులు యూనిట్, బూత్, కెఎస్ఎస్ ఇంచార్జ్ లు, వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పకుండ హాజరవ్వాలన్నారు. మైటీడీపీ యాప్‌లో తప్పనిసరిగా హాజరు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి మండలం ఐ టీడీపీ ఇంచార్జ్ వి.మహేంద్ర, ఏఎంసీ వైస్ చైర్మన్ రోబ్బ హస్వంత్, డైరెక్టర్ చెన్నకేశవ నాయుడు పాల్గొన్నారు.
0 Comments