లంబసింగి జంక్షన్ అతిధి గృహం లీజుకి గిరిజన యువత నుంచి దరఖాస్తుల ఆహ్వానం:ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ

పాడేరు నవంబరు 26(వి.డేవిడ్): చింతపల్లి మండలం లంబసింగి జంక్షన్ లో గల ఐటీడీఏ అతిథి గృహం, క్యాంటీన్లను రెండు సంవత్సరాలు లీజుకివ్వడానికి గిరిజన యువత నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ శనివారం ప్రకటనలో తెలియజేశారు. చింతపల్లి మండలం పరిధిలో పదో తరగతి చదివి  21 సంవత్సరాలు నిండిన గిరిజన యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ గెస్ట్ హౌస్ ను పూర్తిగా ఆధునీకరించి సుందరంగా తీర్చిదిద్ది అందించడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తులు ఐటీడీఏ కార్యాలయంలో ఈనెల 29వ తేదీ నుండి అందుబాటులో ఉంటాయన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రూ. 500 చెల్లించి దరఖాస్తులు పొందాలన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు  పాడేరు ఐటిడిఏ కార్యాలయంలో అందజేయాలన్నారు. గెస్ట్ హౌస్, క్యాంటీను నిర్వహణకు అవసరమైన సిబ్బందిని చింతపల్లి మండలం పరిధిలోగల యువతి, యువకులను నియమించుకోవలసి ఉంటుందన్నారు. గెస్ట్ హౌస్  నిర్వహణకు, క్యాంటీన్ నడుపుటకు ఏడాదికి రూ. ఎనిమిది లక్షలు ఐటీడీఏకి చెల్లించవలసిందిగా నిర్ణయించడం జరిగిందన్నారు. దరఖాస్తులను పరిశీలించిన తరువాత అన్ని నియమ నిబంధనలతో కూడిన దరఖాస్తులు తీసుకొని వాటిలో ఒకరిని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన చింతపల్లి మండలంలోని గిరిజన యువత ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Post a Comment

0 Comments