బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుని కలిసిన నర్సీపట్నం కేడర్

నర్సీపట్నం, జనవరి 1 (సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ బి ఎల్ స్వామి): భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కు నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనకాపల్లి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె వి సత్యనారాయణ, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు, విశాఖ డైరీ డైరెక్టర్ సూర్యనారాయణ, నర్సీపట్నం మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షుడు బోలెం అప్పన్న దొర, నర్సీపట్నం మండల బిజెపి అధ్యక్షుడు నిద్దర శ్రీను, ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను డాక్టర్ కేవీ సత్యనారాయణ, మాధవ్ కు వివరించారు.

Post a Comment

0 Comments