అప్రమత్తంగా కరోనా వైరస్ నీ ఎదుర్కొందాం ..ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయం ఇది ..మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు

చింతపల్లి మార్చి 28:
అప్రమత్తంగా ఉంటూ కరోనా  వైరస్ ని సమర్థవంతంగా ఎదురుకొందామని  మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు . శనివారం చింతపల్లి పట్టణ కేంద్రంలో ఆయన కాలినడకన పర్యటించారు . దుకాణాల వద్దకు వెళ్లి సరుకుల నిల్వలు ఏ విధంగా ఉన్నాయి , మైదాన ప్రాంతాల నుంచి అవసరమైన సరుకులు వస్తున్నాయా అని వర్తకులను అడిగి తెలుసుకున్నారు . వినియోగదారులకు అన్ని రకాల నిత్యావసర సరుకులు దుకాణాల వద్ద లభిస్తున్నాయా  లేదా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు . దుకాణాల వద్ద వినియోగదారులు తప్పకుండా సామాజిక దూరాన్ని పాటించాలని ఆయన సూచించారు. అనంతరం కూరగాయల మార్కెట్నీ కూడా పరిశీలించారు . ఈ సందర్భంగా మాజీ మంత్రి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కరోనా వైరస్ విపత్తు ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రతి తెల్ల రేషన్ కార్డుదారులకు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన ప్రకటించారన్నారు. రేషన్ దుకాణాలకు ముందుగానే అవసరమైన సరకులను తరలించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారన్నారు. గిరిజన ప్రాంతంలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరూ పస్తులు ఉండకుండా అన్ని రకాల చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని ఏ ఒక్కరు అధైర్య పడాల్సిన పని లేదని ఆయన భరోసా ఇచ్చారు. నిత్యవసర సరుకులు తరలింపునకు ఎటువంటి ఆటంకం లేదని, వర్తకుల అవసరమైన నిత్యావసర సరుకులను మైదాన ప్రాంతాల నుంచి తీసుకొనివచ్చి విక్రయించవచ్చు అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయం ఇది అని ఆయన అన్నారు. వర్తకులు సైతం సేవాభావం తోనే వ్యాపారం నిర్వహించాలని ఆయన సూచించారు. గిరిజన ప్రాంతంలో ఎక్కడ కరోనా వైరస్   కేసులు ఇప్పటివరకు  నమోదు కానప్పటికీ ప్రజలందరూ అప్రమత్తంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా ఎట్టిపరిస్థితుల్లోనూ గృహాల నుంచి ప్రజలు బయటకు రాకూడదన్నారు. దుకాణాల వద్ద కూడా వినియోగదారులు ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించాలి అని చెప్పారు . ప్రతి ఒక్కరు తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని, బయటకు వచ్చిన సమయంలో మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. ప్రజలు విందు కార్యక్రమాలు, ప్రయాణాలను పూర్తిగా రద్దు చేసుకోవాలన్నారు. గిరిజన ఆరోగ్యం , నిత్యావసర సరుకుల సరఫరా పై ఐటిడిఎ, జిసిసి, మండల పరిషత్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు.    

Post a Comment

0 Comments