నర్సీపట్నం అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా ధనర్జన్

ప్రమాణ స్వీకారం చేస్తున్న నూతన కార్యవర్గం

నర్సీపట్నం(విఎస్ జయానంద్) ఏప్రిల్ 8: నర్సీపట్నం అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా సమరెడ్డి ధనర్జన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం నర్సీపట్నం లో గిరిజన ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నర్సీపట్నం డివిజన్ నూతన కార్యవర్గాన్ని గిరిజన ఉద్యోగులు ఎన్నుకొన్నారు. ఈ మేరకు అధ్యక్షుడు సమరెడ్డి ధనర్జన్ తోపాటు ప్రధాన కార్యదర్శులుగా జె.సింహాచలం, ఎస్. ధర్మరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జనకాని కృష్ణయ్య, కూడా లక్ష్మణరావు, కార్యనిర్వహక కార్యదర్శులుగా ఎస్. కోటి బాబు,  పంతులు బాబు, కోశాధికారిగా ఎస్. భరత్ కుమార్, ఉపాధ్యక్షులుగా కే. నాగమణి, ఎస్.శ్రావణ్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా అచ్చియమ్మ లను గిరిజన ఉద్యోగులు ఎన్నుకున్నారు. ఈ నూతన కార్యవర్గం ఎన్నికకు  నారాయణరావు, పోతురాజు, అప్పారావు, సోమయ్య, రామారావు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ గిరిజన ఉద్యోగుల సంక్షేమానికి, ప్రగతికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. 

Post a Comment

0 Comments