శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పై గిరిజన విద్యార్థులకు అవగాహన: జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున

పాడేరు డిసెంబర్ 16(వి.డేవిడ్):  గిరిజన విద్యార్థులకు చదువు తో పాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి గిరిజన విజ్ఞాన సంబరాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున    అన్నారు. గురువారం స్థానిక తలారిసింగ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన గిరిజన విజ్ఞాన సంబరాలు- 2021 లకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన సంబరాలు నిర్వహించడం వలన విద్యార్థులలో శాస్త్రీయత, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు పై ఆసక్తి  పెరుగుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. నవంబర్ 3న పాడేరు జిల్లా ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ ప్రారంభించామని, ఈరోజు అరకు ఏరియా ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ ప్రారంభించామని  స్పష్టం చేశారు. ఐటిడిఎ పిఓ గోపాలకృష్ణ చొరవతో  15రోజులకు ఒక మెగా మెడికల్ క్యాంప్, మెగాజాబ్ మేళాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యశ్రీ లో వైద్య సేవలు పొందాలన్నారు.
 సభాధ్యక్షులు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజన సామర్ధ్యాలను వెలికితీయడానికి గిరి విజ్ఞాన సంబరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఐటిడిఎ స్థాయిలో జరుగుతున్న విజ్ఞాన ప్రదర్శనలో 426 ప్రాజెక్టులు ప్రదర్శిస్తున్నారని స్పష్టం చేశారు. గణితంలో 90,ఆంగ్లంలో 90,ఫిజికల్ సైన్సు 80, బయాలజికల్ సైన్సు 96, సోషల్ స్టడీస్ లో 70 ప్రదర్శనలు ఏర్పాటు చేశారని అన్నారు. వాలీ '౧బాల్ ,కోకో కబడ్డీ, అథిల్టిక్స్, ఆర్చరీ క్రీడలు జరుగుతున్నాయని అన్నారు. 864 మంది క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు.
పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశయాలు నెరవేర్చి గిరిజన విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని అన్నారు.విజ్ఞాన సంబరాలలో పండగ వాతావరణం ఏర్పడిందని అన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మక పెంచడానికి ఉపాధ్యాయులచేస్తున్న కృషిని అభినందించారు. ప్రతిఏడాది గిరిజన విజ్ఞాన సంబరాలు నిర్వహించాలని సూచించారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె.సుభద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ ను బలోపేతం చేస్తుందని అన్నారు. మనబడి నాడు నేడులో ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్ స్థాయిలో అభివృధ్ధి చేస్తున్నారని అన్నారు. గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు వి.చిన వీరభద్రుడు మాట్లాడుతూ గతంలో అక్షరాస్యత లో వెనుకబడి ఉన్న ఏజెన్సీ విద్యాపరంగా గొప్ప అభివృద్ధి సాధించిందని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా పెద్ద ఎత్తున విద్యా కార్యక్రమాలు నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. అనంతరం అతిధులు చేతులమీదుగా ఆర్చరీ కీడును ప్రాంభించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనలు తిలకించి గిరిజన విద్యార్థులను అభినందించారు. ముందుగా డా. బి ఆర్ అంబెడ్కర్,అల్లూరి సీతా రామరాజు,  గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటాలకు పూలమాల వేసి ,జ్యోతి ప్రజ్వలన చేసి  కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వి.అభిషేక్ ,గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకు జి.విజయ కుమార్, డీఈఓ ఎల్.చంద్రకళ, డీఈఓ ఏజెన్సీ డా.రమేష్ బాబు పలువురు ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments