71వ సి.బి.సి.ఎన్.సి. క్రైస్తవ మహాసభలు విజయవంతం

నర్సీపట్నం, జనవరి 15( సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ బిఎల్ స్వామి): 
అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం లోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి లో ఈ నెల 13,14,15, తేదీలలో క్రైస్తవ మహాసభలు ఘనంగా జరిగాయి. చర్చి సహకారం తో జరిగిన ఈ మహాసభలకు కృష్ణాజిల్లా అవనిగడ్డ నుండి శ్రీకాకుళం జిల్లా సోంపేట వరకు 7 జిల్లాలలో ఉన్న సి.బి.సి.ఎన్.సి. చర్చిల నుండి నాయకులు, పాస్టర్లు రాయబారులు పాల్గొన్నారు. అనేక అంశాలపై చర్చించారు. సి.బి.సి. ఎన్.సి. కార్యదర్శి ఎ.డి.కె.జాన్ ఆధ్వర్యంలో సి.బి.సి. ఎన్.సి. ప్రెసిడెంట్ టి. ఐజాక్ అధ్యక్షతన రెవ. డా. కొత్తపల్లి అబ్రహం, చైర్మన్, బోర్డు ఆఫ్ క్రిస్టియన్ ట్రైనింగ్ వారి దైవ సందేశం తో భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈ సభకు వైస్ ప్రెసిడెంట్  కె. సుభద్ర , రికార్డింగ్ సెక్రటరీ ఎన్. ఆర్. నవీన్ కుమార్, ట్రస్ట్ చైర్మన్ వై. కృష్ణమూర్తి , గోదావరి అసోసియేషన్ ప్రెసిడెంట్ రెవ. డి. జి. స్వరూప్ బాబు, బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్ రెవ. డా. మేరా జేసుదాస్, ట్రెజరర్ ch. ప్రవీణ్ , స్థానిక చర్చ్ ప్రెసిడెంట్  ఎన్. ఆర్. నవీన్ కుమార్ , సెక్రటరీ పి. దేవానంద్ , ట్రెజరర్ సాల్మన్, వైస్ ప్రెసిడెంట్ ఎన్. వయోలా లిలియన్ తదితరులు పాల్గొన్నారు. సభలో వి. విజయకుమార్, బొబ్బిలి ఐరిస్ విద్యాసంస్థల అధినేత ను గౌరవ చైర్మన్ గా ఎన్నుకున్నారు.

Post a Comment

0 Comments