గూడెంకొత్తవీధి, మర్చి 27:
స్థానిక మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు నెలాఖరు వరకు అవసరమైన రేషన్ పంపిణీ చేసినట్టు ప్రధానోపాధ్యాయులు దొండా కాళేశ్వర రావు అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివానలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలకు సెలవులు ప్రకటించాయి. అలాగే లాక్ డౌన్ అమలుపర్చింది. కాగా పాఠశాల విద్యార్థులకు నెలాఖరుకి అవసరమైన సరుకులను పంపిణీ చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు వెంటనే స్పందించిన ప్రధానోపాధ్యాయులు కాళేశ్వర రావు ఇంటింటికి వెళ్లి విద్యార్థులను పాఠశాలకు తీకొని వచ్చి బియ్యం, పప్పులు, గుడ్లు, ఇతర వటసామాగ్రి ని అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ప్రభుత్వం కేటాయించిన సరుకులు అందజేశామన్నారు.
0 Comments