చింతపల్లి, డిసెంబర్ 3 ( జయ ఆనంద్ ):
గిరిజనుల సంక్షేమ అభివృద్ధి కోసం అరకు ఎంపీ గుమ్మ తనుజా రాణి అహర్నిశలు శ్రమిస్తుందని చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూష దేవి అన్నారు. బుధవారం చింతపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు కార్యాలయంలో జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య, చింతపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ దురియా పుష్పలతతో కలిసి ఎంపీ తనుజరాణి జన్మదినం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఉన్నత విద్యావంతురాలు, గిరిజనుల కష్ట సుఖాలు, సమస్యలు, జీవనశైలి పై సమగ్రమైన అనుభవం కలిగిన వ్యక్తిగా ఎంపీ తనుజారాణి రాణిస్తున్నారని ఎంపిపి అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో లేకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ మంత్రులు, ప్రధానమంత్రి తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ గిరిజన ప్రాంతానికి నిధులు తీసుకువచ్చి ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆదివాసి సమస్యలపై పార్లమెంట్లో గొంతెత్తి ప్రశ్నించడంలో ఆమెకు సాటి లేరన్నారు. జీవో నెంబర్ 3, భూ బద్దలాయింపు చట్టం కోసం చట్టసభల్లో ఆమె పోరాటం చేస్తున్నారన్నారు. ఆమె సేవలను గిరిజనులు ఎన్నటికీ మరువలేరని, ఆదివాసీల అభివృద్ధికి ఆమె మరింతగా కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు గుణ బాబు, ఎంపీటీసీ సభ్యురాలు ధార లక్ష్మి పద్మ పాల్గొన్నారు.
0 Comments