పెండింగ్ లో ఉన్న మ్యుటేషన్స్ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి.
జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటిడిఏ పిఓ తిరుమణి శ్రీ పూజ
పాడేరు డిసెంబర్ 23 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : మండల రెవెన్యూ అధికారి, ఆర్డీవో లాగిన్ లో పెండింగ్ లో ఉన్నటువంటి మ్యుటేషన్స్ త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ పాడేరు, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీ పూజ ఆదేశించారు. మంగళవారం ఐటిడిఏ పీవో ఛాంబర్ నందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా రెవెన్యూ అధికారులు, మండల రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశము లో ఆమె మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్నటువంటి మ్యూటేషన్స్, సర్వే సంబంధిత సమస్యలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రతిరోజు పెండింగ్ ఉన్నటువంటి భూ సంబంధిత సర్వేలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్నటువంటి మ్యూటేషన్స్, రీసర్వే సంబంధిత సమస్యలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.పరిష్కారం కాని సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తేవాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలో రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ శత శాతం పూర్తి చేయాలనీ, పంపిణీలో వచ్చే అవాంతరాలను అధిగమించాలన్నారు. రెన్యువల్ కొరకు చౌక ధరల దుకాణాల సంబంధిత దస్త్రాలను ఆర్డీవో కార్యాలయానికి పంపించి అనుమతులు తీసుకోవాలన్నారు. స్మార్ట్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, తొలగింపు సమగ్ర సమాచారంతో చేపట్టాలన్నారు. పీ ఎం జన్ మన్ పథకంలో భాగంగా మంజూరైన గృహాలను త్వరగా పూర్తి చేసే విధంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. గృహ నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షించి, పూర్తి అయిన నిర్మాణాలకు బిల్లులు సకాలంలో మంజూరు చేయాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొనుటలో ప్రభుత్వ రాయితీలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చింతూరు ఇంచార్జ్ పివో శుభం నొక్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి అంబేద్కర్, పాడేరు ఇంచార్జ్ ఆర్ డివో లోకేశ్వరరావు, వివిధ మండలాల రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments