మన్యం బిడ్డకు సత్కారం - జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్

మన్యం బిడ్డకు సత్కారం 
జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్

పాడేరు, డిసెంబర్ 8 సురేష్ కుమార్, పాడేరు (స్టాఫ్ రిపోర్టర్): అంతర్జాతీయ అండర్ 19 క్రికెట్ టి20 ప్రపంచ కప్ 2025 విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మన్యం బిడ్డ పాంగి కరుణాకుమారి నీ సోమవారం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ దుస్సాలువా కప్పి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి జిల్లా వంట్లమామిడి గ్రామానికి చెందిన పీవిటీజి కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో రాణించి కప్పు గెలిచేందుకు కీలక పాత్ర పోషించడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం అని ఈ గెలుపు అల్లూరి జిల్లాకు గర్వకారణం అని అన్నారు. పాంగీకరణకుమారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి లేఖ పంపించామని తెలియజేశారు. పిఎం జన్మన్ పథకం ద్వారా ఇల్లు మంజూరు చేస్తామని అలాగే ఆమె చదువుకునేందుకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పాంగీ కరణకుమారి బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి అంబేద్కర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి కే ప్రసాద్, పాంగి కరణకుమారి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments