చింతపల్లి, డిసెంబరు 7 (స్టాఫ్ రిపోర్టర్ పాంగి సురేష్ కుమార్): అంద్రకశ్మీర్ లంబసింగిలో ఆదివాసీ మహిళలు ధింసా నృత్యం ప్రదర్శిస్తూ పర్యాటకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఈప్రదర్శనలతో ఆదివాసీ మహిళలు ఉపాధి పొందుతున్నారు. అదివాసీల సాంప్రదాయ నృత్యం ధింసాకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపువుంది. ఈనృత్యాన్ని వీక్షించేం దుకు మైదాన ప్రాంత ప్రజలతోపాటూ గిరిజనులు సైతం ఆసక్తి చూపుతున్నారు. దీంతో పాడేరు ఐటీడీఏ, పంచాయతీ సహకారంతో చెరువులవేనం ముఖద్వారమైన భీమనాపల్లి గ్రామం వద్ద అదివాసీ గిరిజన ధింసా నృత్యం కమిటీ సభ్యులు ప్రత్యేక ప్రదర్శన వేదికను ఆదివారం ఏర్పాటు చేశారు. ప్రాంతీయ ఆదివాసీ మహిళలు పర్యాటక సీజన్ ముగిసే వరకు ధింసా నృత్యాన్ని ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి 1గంటల వరకు, సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రదర్శించనున్నట్లు నిర్వహకుడు బొబ్బిలి కామేశ్వరరావు తెలిపారు. మరో పది రోజుల్లో ఆదివాసీల వస్త్రదారణ ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ధింసా నృ త్యానికి ఆధునిక స్టెప్పులను జోడించి లయబద్ధంగా, ఆకర్షణీయంగా ఆదివాసీ మహిళలు ప్రద ర్శిస్తుండడంతో తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఈవేదిక వద్ద ప్రవేశించేం దుకు పెద్దల నుంచి రూ.30, పిల్లల నుంచి రూ.10 ధరలను కమిటీ సభ్యులు వసూలు చేస్తు న్నారు. గిరిజన మహిళలు స్వయం ఉపాధి పొందుతూ వినోదాన్ని పంచడాన్ని పర్యాటకులు స్వా గతిస్తున్నారు. ఈధింసా వేదిక లంబసింగికి అదనపు శోభను తీసుకొచ్చిందని పర్యాటకులు చెబు తున్నారు. కొంత మంది పర్యాటకలు ఉ ఆదివాసీ మహిళలతో కలిసి ధింసా స్టెప్పులు వేస్తున్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ కొర్ర శాంతి, మాజీ సర్పంచ్ రఘునాథ్, వీఆర్వో వి. సదానందరావు. పేసా కమిటీ ఉపాధ్యక్షుడు భలరామ్ పాల్గొన్నారు.
0 Comments