ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన అంబులెన్స్ ప్రారంబించిన జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్
పాడేరు, నవంబర్ 27 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ కు సంబంధించి రెడ్ క్రాస్ సేవలు విస్తృతం చేసేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన అంబులెన్స్ కొనుగోలు చేసింది. జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు ఏఎస్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ తిరుమణి శ్రీ పూజ, అసిస్టెంట్ కలెక్టర్ కె. చిరంజీవి నాగ వెంకట సాహిత్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నూతన అంబులెన్స్ ను లక్ష్మివారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం విస్తృతంగా పనిచేస్తుందని, అధికారులందరూ రెడ్ క్రాస్ సొసైటీ కి సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యవర్గం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని అన్నారు. డిసెంబర్ లో జనరల్ బాడీ నిర్వహించి పూర్తిస్థాయిలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ఎంపీడీవోలు, తహసిల్దార్లు, మండల విద్యాశాఖ అధికారూలతో టీముగా ఏర్పాటు చేసి విరివిగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ తయారుచేసి ఆయా మండలాల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. రక్తపు నిలువలను పెంచేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తూ, రక్తదాన శిబిరాలు నిర్వహించేలా చర్యలు చేపడతామని అన్నారు.
పాడేరు డివిజన్ పరిధిలో రెడ్ క్రాస్ సొసైటీ వాహనాన్ని వినియోగించుకోవాలని పాత వాహనాన్ని చింతూరు ప్రాంతంలో అప్పగించి చింతూరు, రంపచోడవరం ప్రాంతానికి పనిచేస్తుందని, చింతూరు ప్రాజెక్టు అధికారి, ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీని జిల్లాలో మరింత బలంగా పనిచేసేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వైస్ చైర్మన్ ఎస్ గంగరాజు మాట్లాడుతూ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ విస్తరణకు జిల్లా కలెక్టర్ విశేష కృషి చేస్తున్నారని అదే చొరవతో జిల్లా అధికారులంతా తమకు సహకారం అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపారు. గతంలో ఓ నూతన వాహనాన్ని కొనుగోలు చేసి విశాఖపట్నం కేజీహెచ్ లో ఎస్టీ సెల్ కు అప్పగించామని దానిని గిరిజన రోగుల కోసం వినియోగించుకుంటున్నారని అన్నారు.
వాహన ప్రారంభోత్సవానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులకు ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ గంగరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్రా నాగరాజు, రెడ్ క్రాస్ మెంబర్స్ జిల్లా కలెక్టర్ కు పూల బొకేతో ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఏం వి ఎస్ లోకేశ్వరరావు,రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి సూర్యారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు తమర్బా ప్రసాద్ నాయుడు, సుబ్రహ్మణ్యం, రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
0 Comments