జిల్లాలో ప్రతి గ్రామాన్ని సాంకేతికతో అనుసంధానం చేయాలి __జిల్లా కలెక్టర్ ఏఎస్. దినేష్ కుమార్

జిల్లాలో ప్రతి గ్రామాన్ని సాంకేతికతో అనుసంధానం చేయాలి
అందుకు అనుగుణంగా కొత్త మొబైల్ టవర్ల నిర్మాణం 

జిల్లా కలెక్టర్ ఏఎస్. దినేష్ కుమార్ 

పాడేరు నవంబర్ 24 (సురేష్ కుమార్, పాడేరు స్టాప్ రిపోర్టర్): జిల్లాలో  ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడానికి సాంకేతికతను మరింత అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ లో మూడు ఐటిడిఏ పిఓలు, సబ్ కలెక్టర్లు, సర్వీస్ ప్రొవై డర్లు, మండల రెవెన్యూ అధికారులతో  వర్చువల్ గా వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలకు ముడిపడి ఉన్నటువంటి సాంకేతికలు సమస్యలను అధిగమించడానికి సెల్ టవర్ లను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సెల్ టవర్ నిర్మాణాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. సెల్ టవర్ నిర్మాణానికి అనువైన ప్రదేశాలను గుర్తించాలని, భూ సమస్యలను అధిగమించడానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. అనువైన ప్రదేశాలు లేని చోట అటవీ శాఖ పర్మిషన్ తో అటవీ స్థలాలను తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో బిఎస్ఎన్ఎల్, జియో ఎయిర్టెల్ యొక్క టవర్ల  నిర్మాణం వేగవంతం చేయాలని కోరారు. ఇంకా ఏయే ప్రదేశాల్లో కొత్త టవర్ల నిర్మాణం అవసరమవుతుందో ఆ ప్రదేశాలను గుర్తించి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్, ఐటిడిఏ పివో తిరుమణి శ్రీ పూజ, రంపచోడవరం ఐటిడిఏ పివో స్మరణ్ రాజ్, చింతూరు ఇంచార్జ్ ఐటిడిఏ పివో  శుభం నోఖ్వాల్, పాడేరు ఇంచార్జ్ ఆర్ డి వో ఎస్ విఎస్. లోకేశ్వరావు, సర్వీస్ ప్రొవై డర్లు, పలు మండలాల రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments