డిసెంబర్ 5న మెగా పేరెంట్ టీచర్ మీట్ - జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్

డిసెంబర్ 5న పండగ వాతావరణంలో మెగా పేరెంట్ టీచర్ మీట్ 
వచ్చే ఐదు సంవత్సరాలు గాను కాఫీ ఉత్పత్తులపై కార్యాచరణ ప్రణాళిక

జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ 

పాడేరు, నవంబర్ 29 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): 2025-2026 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వా ఆదేశాలు మేరకు డిసెంబర్ 5న మెగా పేరెంట్ టీచర్ మీట్ జిల్లాలో అన్ని ప్రభుత్వ సంబంధిత ప్రైమరీ పాఠశాలు, సెకండరీ పాఠశాలలు, జూనియర్ కళాశాల లలో పండగ వాతావరణం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరానికి గాను జరిగిన ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ లా పరీక్షల ఫలితాలు, పురోగతి పై తల్లిదండ్రులకు వివరించబడతాయని పేర్కొన్నారు. పాఠశాల, ఉపాధ్యాయులు పనితీరుపై విద్యార్థుల తల్లిదండ్రులకు తెలుపబడతాయని అన్నారు. జిల్లాలో 2945 ప్రభుత్వ పాఠశాలు, జూనియర్ కాలేజెస్ లో ఉన్న 1.8 లక్షల విద్యార్థులు, తల్లిదండ్రులు 1.2 లక్షల మంది పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై ఎంఈఓస్, ఎ టి డబ్ల్యూ ఎస్, ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 గంటలు వరకు, అనంతరం డొక్కా సీతమ్మ భోజన కార్యక్రమంతో ముగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీచింగ్ మెటీరియల్, స్పోర్ట్స్ మెటీరియల్, లైబ్రరీ బుక్స్ ప్రదర్శన చేయబడతాయని అన్నారు. ఫౌండేషన్ లిట్రసి న్యూమరాసి (FLN) బేస్ లైన్ పరీక్షలు జూలైలో పెట్టడం జరిగిందని, ఫలితాలు బట్టి ఏబిసిడి కేటగిరి కేటాయించి, సిడి కేటగిరీలో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 6300 ఉపాధ్యాయులకు దీనిపై ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. బేస్ లైన్ శిక్షణా కార్యక్రమం చాలా క్రమబద్ధంగా, పగడ్బందీగా జరుగుతుందని తెలిపారు. మెగా పేరెంట్ టీచర్ మీట్లో ప్రజాప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులకు సన్మాన కార్యక్రమం జరుపబడుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థుల ప్రతిభ, అనుమానాల నివృతి పై ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి క్లాస్ రూమ్ లో సమీక్షిస్తారని తెలిపారు. సెకండరీ విద్యార్థులకు తెలుపబడే కెరియర్ గైడెన్స్, నైపుణ్యాభివృద్ధి, మెంటల్ హెల్త్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, అంటూ అంశాలపై తల్లిదండ్రులకు వివరించడం జరుగుతుందని అన్నారు. 


మన ప్రాంతాల్లో పండిన అరుకు కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని, దానికి తగినట్లుగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు.రాబోయే సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు కాఫీ ఉత్పత్తులపై కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వం జీవో రూపంగా విడుదల చేసిందని తెలిపారు. మన జిల్లా గాను కాఫీ ప్రాజెక్ట్ నిమిత్తం 202.19 కోట్ల మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పాడేరు డివిజన్ 11 మండలాలో లక్ష ఎకరాలు అదనపు కాఫీ తోటలు, 75 వేల ఎకరాలలో 30 సంవత్సరాలు దాటిన మొక్కలను తొలగించి, గ్యాప్ ఫీలింగ్ చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. విపత్తులు తట్టుకునే విధంగా తొమ్మిది రకాల నేటివ్ షేడ్ ప్లాంటేషన్ సిల్వర్ ఓక్ బదులుగా చేపట్టడం జరుగుతుందని అన్నారు.
మల్టీక్రాపింగ్ పద్ధతిలో ప్రయత్నం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సంవత్సరానికి గాను 1000 యూనిట్స్ మోటరైజ్డ్ బేబీ పల్పర్ యూనిట్స్ 85% సబ్సిడీతో రైతులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జీకే విధి, జీ మాడుగుల గ్రామాలలో ఎక్కువ పల్పర్ యూనిట్ మంజూరు అయ్యిందని, నిధులు మంజూరులో జాప్యం కారణంగా పనులు జాప్యం జరుగుతుందని అన్నారు. వచ్చే సంవత్సరం కాఫీ ఉత్పత్తి సమయానికి ఎక్కువ పల్పర్ యూనిట్స్ వాడకంలోకి వస్తుందని తెలిపారు. కాఫీ పండ్ల రకాలు బట్టి గ్రేట్ నిర్ధారిస్తామని, గ్రేడ్స్ నిర్ధారణ బట్టి రైతులకి గిట్టుబాటు ధర తెలియజేశారు. అరబికా కాఫీకి పార్చ్మెంట్ 450 రూపాయలు, చెర్రీ కాఫీ 270 రూపాయలు నిర్ధారించడం జరిగిందని అన్నారు. ఏ గ్రేడ్ కాఫీ పళ్ళకు కేజీ 60 రూపాయలు చొప్పున, బి గ్రేడ్ కాఫీ పళ్ళకు కేజీ 55 రూపాయలు చొప్పున నిర్ధారించామని తెలియజేశారు. 
కాఫీ బెర్రీ బోర్డర్ పాక్షికంగా ప్రభావిత ప్రాంతాలపై ఆంక్షలు విధించామని, ఆంక్షలు తప్పితే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. దీనిపై అవగాహన సదస్సులు పెట్టడం జరిగిందని తెలియజేశారు. కాఫీ విక్రాలు చేసే వాళ్ళకి లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలియజేశారు.

ఈ పత్రిక సమావేశంలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటిడిఏ పిఓ తిరుమని శ్రీ పూజ, జిల్లా విద్యాశాఖ అధికారి పి బ్రహ్మాజీ, సమగ్ర శిక్షణ అధికారి స్వామి నాయుడు, జిల్లా హార్టికల్చర్ అధికారి కరెంట్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments