ప్రణాళిక బద్ధంగా ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలి
జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ
పాడేరు, అక్టోబర్ 08 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళిక బద్ధంగా ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు.
గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ధాన్యం సేకరణ పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఖరీఫ్ కాలంలో చాలా జాగ్రత్తలు పాటించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరించాలని సూచించారు.
వ్యవసాయ అధికారులు కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసి అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అన్న నివేదిక అందజేయాలన్నారు. గత సంవత్సరం అనుభవాలు దృష్ట్యా ఏమన్నా సమస్యలు ఉంటే తెయజేయాలన్నారు.
అలాగే మార్కెట్ కమిటీ అధికారులు అన్ని ఆర్బికే లు, నిల్వ గోదాములు తనిఖీ చేసి ఖాళీ స్థలాలు వాటి వివరాలు నివేదికలుఅందజేయాలన్నారు. తూనికలు కొలతలు అధికారులు ఆర్బికేలు లో ఉన్నటువంటి తూనికల పరికరాల పనితీరుని పరిశిలించాలన్నారు. అలాగే తేమ కొలిచే యంత్రాలు పరిశీలించి కావలసిన చర్యలు చేపట్టాలన్నారు. నిల్వలను మిల్లులకు తరలించేందుకు సకాలంలో వాహనాలను సమకూర్చాలని ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా వాహనాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో ధాన్యం వర్షాలకు తడవకుండా ఉండేందుకు ప్రతి ఎంఎస్పి సెంటర్లలో వందకు పైగా టార్పాలియన్స్ రైతులకు అందుబాటులో ఉంచాలని డీఎం సివిల్ సప్లైస్ వారిని ఆదేశించారు. అదేవిధంగా రాగి కొనుగోలు కేంద్రాలను కూడా పరిశీలించి ఎంత కొనుగోలుకు వస్తుందో తెలియజేయాలన్నారు.
సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి యస్ బి యస్ నంద్ , జిల్లా పౌర సరఫరాల అధికారి & జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వి మోహన్ బాబు , రవాణాశాఖాధికారి ప్రకాష్ రావు, జిల్లా సహకారశాఖాధికారి రామకృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు.
0 Comments