ఉత్తమ ఫలితాలు సాధించండి
సమగ్ర గిరిజన వృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ
పాడేరు, అక్టోబర్ 06 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యను చదువుకోవాలని సమగ్ర గిరిజన వృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ హితవుపలికారు.
విద్యార్థులు గణితం పై మంచి పట్టుసారించాలని ఐటిడిఎ ప్రాజెక్ట్ 6అధికారి అన్నారు. సోమవారం తన పర్యటనలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచలకులతో కలసి బుధవారం హుకుంపేట మండలం అల్లం పుట్టు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.
కొంత సమయం విద్యార్థులతో ముచ్చటించి పదవ తరగతి విద్యార్థులకు గణితమ, హిందీ సబ్జెక్టు పలు ప్రశ్నలు వేసి విద్యార్థులు వెనుకబడి ఉండటాన్ని గమనించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేదిశగా చర్యలు చేపట్టాలని పిల్లలు గణితం పై పట్టు సాధించేలా విద్యను అభ్యసించాలని ట్రైబల్ వెల్ఫేర్ ఉపసంచాలకులకు ఆదేశించారు.
0 Comments