మెరుగైన విద్యను అందించే దిశగా శిక్షణ, బోధనాభ్యాసనా స్థాయి మెరుగుపడాలి
అల్లూరి జిల్లా వ్యాప్తంగా ఉపాద్యాయులకు TaRL శిక్షణా కార్యక్రమం ప్రారంభం
జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్
పాడేరు, అక్టోబర్ 06 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): మెరుగైన విద్యను అందించే దిశగా శిక్షణ, బోదనాభ్యసనాస్థాయి మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ అన్నారు.
పాడేరు మండలం లో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల, శ్రీ కృష్ణాపురం లో సమగ్ర శిక్ష ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం ను గౌరవ జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ గ ప్రారంబించారు. ఈ సందర్బంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ జిల్లాలో అన్నీ స్కూల్లలో బోదనాభ్యసనా స్థాయిలు పెరగాలని, కనీస అభ్యసన స్తాయిలు అన్నీ స్కూల్ లలో మెరుపడాలని అన్నారు. అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరులో ఉన్న అన్నీ ప్రభుత్వ యాజమాన్యాల ఉపాద్యాయులకు TaRL (Teaching at Right Level) శిక్షణ సోమవారం అక్టోబర్ 06 నుండి జిల్లాలోని అన్నీ మండల కేంద్రాలలో ప్రారంభమయ్యాయి. మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీషు మరియు లెక్కలు బోధించే ఉపాధ్యాయు అందరికీ రెండు విడతలుగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
మొదటి విడత శిక్షణ అక్టోబర్ 06 నుండి 08 వ తేదీ వరకు జరుగును, రెండవ విడత శిక్షణ అక్టోబర్ 09 నుండి అక్టోబర్ 11 వరకు జరుగును.మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులు నాన్ రెసిడెన్సియల్ మోడ్ లో జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి మొదటి విడత లో మొత్తం 3111 మంది ఉపాద్యాయులు రెండవ విడత లో మొత్తం 3098 మంది ఉపాద్యాయులు శిక్షణ పొందనున్నారు, 128 రిసోర్స్ పర్సన్ లు పని చేయనున్నారు . రాష్ట్ర స్థాయి నుండి 80 ఎస్ ఆర్ పి లు శిక్షణ పర్యవేక్షణ కు రానున్నారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అదనపు పదక సమన్వయకర్త డాక్టర్ వి ఏ స్వామి నాయుడు, జిల్లా విద్యా శాఖాదికారి బ్రహ్మాజీ రావు, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి శ్రీ డాక్టర్ వి ఏ స్వామి నాయుడుతో పాటు పాడేరు మండల విద్యాశాఖాదికారులు, క్లస్టర్ హెడ్ మాస్టర్ లు, డిఆర్పిలు, జిల్లా సమగ్ర శిక్ష సిబ్బంది, పాడేరు మండల సిఆర్పిలు ఉన్నారు.
0 Comments