ప్రతి గ్రామంలో తాగునీటిని పరీక్షించి విధిగా క్లోరినేషన్ చేయాలి ___జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్

ప్రతి గ్రామంలో తాగునీటిని పరీక్షించి విధిగా  క్లోరినేషన్ చేయాలి
బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్

పాడేరు, అక్టోబర్ 06 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, గ్రామాలలో క్రింది స్థాయి సిబ్బంది  ప్రతి గృహమును సందర్శించి  మరుగుదొడ్లు  (ఐ హెచ్ హెచ్ ఎల్) సౌకర్యం  ఉన్నాయో లేదో  సమాచారాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. 
ఆర్ డబ్ల్యూ ఎస్ ఇంజనీరింగ్ అధికారులు , మండల అభివృద్ధి అధికారులు, ఈ వో పి ఆర్ డీ లు క్షేత్ర స్థాయి లో పర్యటించి నిరంతరం ఈ కార్యక్రమమును పర్యవేక్షణ చేసి జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ప్రతిపాదనలు తయారుచేసి  జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలన్నారు. స్వచ్  భారత్ మిషన్ ద్వారా  మండల రిసోర్స్ కోఆర్డినేటర్లలకు శిక్షణ ఇప్పించి వారిని సద్వినియోగం చేసుకొని అధికారుల సమన్వయముతో జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తయారు చెయ్యాలని పిలుపునిచ్చారు. సొంత భవనములు  కలిగి ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో , ప్రముఖ పర్యాటక దర్శనీయ ప్రదేశాలలో, ప్రజలు అధికముగా తిరుగాడే  బహిరంగ స్థలాలలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లను నిర్మించడానికి వాటిలో మౌళిక వసతులను కల్పించడానికి ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో  మిగిలిఉన్న  మరుగుదొడ్లు , నీటి వసతి కల్పించి పనులను పూర్తి చేయడానికి పెండింగ్ లో ఉన్న బిల్లులను ఉన్నతాధికారులతో  మాట్లాడి చెల్లింపులను చేపట్టాలన్నారు. ప్రతి గ్రామములో తాగునీటిని పరీక్షించి విధిగా  క్లోరినేషన్  చేయాలని , ఫ్లోరిడ్ ,నైట్రేట్ , బాక్టీరియా  లాంటి అవశేషాలు తాగునీటిలో  కనబడకుండా నిరంతరం  వాటర్ టెస్టింగ్  శాంపిల్ లను  సేకరించి పరిక్షీంచాలన్నారు. కార్యక్రమములో ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈ  బివివి నాగేశ్వరరావు, డిఆర్డిఏ  పిడి మురళి , జిల్లా వ్యవసాయ అధికారి  నంద, ఏ పి ఈపిడిసియల్  ఎస్ఈ  ప్రసాద్, పంచాయత్ రాజ్ ఈఈ కొండయ్య పడాల్ , మండల అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు .

Post a Comment

0 Comments