ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ప్రభుత్వం
ఆటో , క్యాబ్ డ్రైవర్స్ కు శుభాకాంక్షలు
జిల్లాలో 4217 మంది లబ్దిదారులకు 6 కోట్ల 32 లక్షల 55 వేల రూపాయల బ్యాంక్ ఖాతాలో జమ
గిరిజన సంక్షేమ, జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి
పాడేరు అక్టోబర్ 4 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): సూపర్ సిక్స్ లో భాగంగా ప్రభుత్వం ఇచిన్న ప్రతీ హామీ నిల్లబెట్టుకుందని గిరిజన సంక్షేమ శాఖ మరియు ఇంచార్జ్ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శనివారం ఐటీడీఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ తో కలసి ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమoలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా గిరిజన సంక్షేమ శాఖ మరియు ఇంచార్జ్ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీ పూజ, జిసిసి చైర్మన్ శ్రావణ్ కుమార్, జిసిసి ఎండీ కల్పనా కుమారి, మాజీ శాసనసభ్యులు గిడ్డి ఈశ్వరి, హస్తకళాకారుల చైర్మన్ గొంగలయ్య తదితరులు భారీగా పాతబస్టాండ్ నుంచి ఆటోలో ర్యాలీగా బయలుదేరి ఐటీడీఏ సమావేశ మందిరానికి చేరుకున్నారు.
ఈ సందర్బంగా గిరిజన సంక్షేమ శాఖ , జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు మాట్లాడుతూ ఆటో సోదరులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఎప్పుడు అల్లూరి జిల్లా పుట్టన ఇల్లు అని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నెరవేరుస్తున్న మరో హామీ ఆటో డ్రైవర్ సేవలో పధకం ద్వారా ప్రతి ఆటో, మ్యాక్స్ క్యాబ్, మోటార్ డ్రైవర్లకు ఏటా ₹15,000 చొప్పున అందిస్తుందని తెలిపారు.
రాష్ట్రము లో 2,90,669 మంది లబ్దిదారులకు 436 కోట్ల 35 వేల రూపాయలు మరియు జిల్లాలో ఆటో డ్రైవర్ సేవలో పధకం కింద 4217 లబ్దిదారులకు 6 కోట్ల 32 లక్షల 55 వేల రూపాయలు వారి వ్యక్తిగత ఖాతాలో నేరు గా ప్రభుత్వం విదుల చేసింది అని తెలిపారు. కార్యక్రమం లో పాల్గొన్న ఆటో డ్రైవర్ కు మంత్రి వర్యులు చేతుల మిదగా చెక్ ను అందజేసారు. ఆటో డ్రైవర్లందరూ మానవతా దృక్పథం కలిగి ఉన్న వాళ్ళని అన్నారు. సూపర్ సిక్స్ పధకాలు ద్వారా ప్రజలందరూ సంతోషకరంగా ఉన్నారని తెలియజేసారు. ప్రతి కుటుంబానికి తల్లికి వందనం, దీపం పధకం, వృధప్య పెన్షన్, స్త్రీ శక్తీ ఇప్పుడు ఆటో డ్రైవర్ సేవలో పధకం అందుబాటులోకి తేవడం చాల ఆనందంగా ఉందని అన్నారు. మహిళలు ఆటో ఎక్కడ ఆపిన గమ్య స్థానానికి సురక్షితంగా చేర్చాలని సూచించారు. మన విద్య శాఖ మంత్రి మర్యులు నారా లోకేష్ రాష్ట్రములో పాటశాలలు మెరుగు పరిచే విధంగా చర్యలు చేపట్టారని దాని వల మన జిల్లాలో కూడా చాల పాటశాలలకు కొత్త భవనాలు , పునర్నిర్మాణం మంజూర చేయడం జరిగింది అని తెలిపారు. పంచాయితీ మరియు ఉప ముఖ్య మంత్రి కోనెదల పవన్ కళ్యాణ్ సూచనలతో జిల్లాలో ప్రతి గ్రామాల్లో రహదారుల నిర్మాణాలు వేగావంతగా జరుగుతునాయన్నారు. స్త్రీ శక్తీ పధకం ద్వారా ప్రతి మహిళా తన పుట్టిన ఇంటికి ఎక్కువ సార్లు వెళ్తున్నారని ఆనందం వ్యక్తం చేసారని తెలియజేసారు. గర్భిణీ స్త్రీలను, పేదవాళ్లకు, వాళ్ల దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్లని గమ్య స్థానానికి చేర్చాలని ఆటో డ్రైవర్లు కోరారు. అరుకు కాఫీకి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని ఆనందం వ్యక్తం చేసారు. జి ఎస్ టి తగ్గించడం ద్వారా నిత్య అవసరాల సరుకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు మిద టాక్స్ బాగా తగ్గిందని తెలియజేసారు. ఆటో డ్రైవర్లకు టాక్స్ లేదని అన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు లాంఛనంగా ఈ కార్యక్రమం అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రభుత్వం విజయవాడలో ప్రారంభించడం జరుగుతోందని, మన జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ మరియు ఇంచార్జ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యరాణి గారిచే ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆటో డ్రైవర్ కుటుంబాలకు ధన్యవాదాలు తెలియజేశారు. అంబులెన్సులు వెళ్ళలేని మారుమూల ప్రాంతాలకు ఆటోలు వెళ్లి గమ్యస్థానం చేరుస్తున్నాని తెలిపారు. ఆటోల ద్వార గిరిజన ప్రాంతాల ప్రజలకి రవాణా సక్రమంగా జరుగుతుందన్నారు. రైతులను సంతలకు తీసుకొని వెళ్లి తిరిగి తీసుకువస్తున్నారని తెలిపారు. రవాణా శాఖ వారు ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయం ద్వారా వారి వివరాలను సేకరించి వెబ్ పోర్టల్ నందు లబ్దిదారుల వివరాలు పొందుపరచడం జరుగుతుంది.
హస్తకళా చైర్మన్ మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు లేక చాలీచాలని జీతాలతో సతమతం అవుతున్న ఆటో డ్రైవర్లకు గౌరవ ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి వారి హామీల్లో భాగంగా సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయం అందిస్తుందని, ఇంకా మారుమూల ప్రాంతాల్లో లింక్ రోడ్లు వేయడం జరుగుతుందని తెలియజేశారు.
జీసీసీ చైర్మన్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో అందరూ భాగస్వాములు కావాలని, ఈ ప్రభుత్వం హామీలన్నీ నెరవేర్చడం జరిగిందని, జీఎస్టీ తగ్గించడం ద్వారా నిత్యావసర సరుకులు తక్కువ ధర కొనుగోలు చేయడం జరుగుతుందని, ఆటో డ్రైవర్లందరూ చెడు వ్యసనాలకు బానిస కాకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్రభుత్వం మంజూరు చేసిన ₹15,000 సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
టీడీపి ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వం చేయూత, స్వశక్తి, స్వయంశక్తి, దసరా కానుక రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని, సూపర్ సిక్స్, సూపర్ హిట్ కార్యక్రమంలో ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయని, ఇంకనూ జీఎస్టీ తగ్గడంతో ఎక్కువ మంది ఆటోలు కొనుగోలు చేసుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి కేవీ ప్రకాష్, సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments