వినతుల పరిష్కారం వేగవంతం చేయాలి
సమస్యల పరిష్కారానికి అధికారుల చొరవ చూపించండి
పిజిఆర్ఎస్ కు 67 అర్జీలు
జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్
పాడేరు, అక్టోబర్ 03 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థకు 67 వినతులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ డా. ఎం జె అభిషేక్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ కె. సాహిత్, డిఆర్ఓ కె. పద్మలత సంయుక్తంగా వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. అర్జీ దారుల నుండి స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు అందించి త్వరితగతన పరిష్కరించాలని ఆదేశించారు.
అర్జిదారులు మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి, అర్జీలు నేటికీ పరిష్కారం కాకపోయినా, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ ను సంప్రదించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
స్వీకరించిన ఫిర్యాదులు కొన్ని
హుకుంపేట మండలం మత్య్సపురం పంచాయతి మత్య్సపురం గ్రామానికి చెందిన పి. చందన్న పాత్రుడు వైస్ సర్పంచ్ సి సి రోడ్డు మంజూరు కోరుతూ అర్జి పెట్టుకున్నారు.
ముంచింగిపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతి కొండపడ గ్రామస్తులు కే. బాల రాజు, పి.రామచంద్రరావు, పి. సోన్ను శిధిలావస్థలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని తొలగించి నూతన భవన నిర్మించాలని కోరుతూ అర్జి పెట్టారు.
కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయతి డి.కొత్తూరు, రామ్ నగర్ ,మల్లవరం గ్రామస్తుడు కే. స్వాతి కుమార్ త్రీ ఫేజ్ ట్రాన్స్ ఫార్మర్ మంజూరు కోరుతూ ధరఖాస్తు చేసారు.
దుంబ్రిగుడ మండలం గసబ పంచాయతి చిమిలి గుడ గ్రామం నుండి వయ్య సిరసగుడ గ్రామం వరకు తారు రోడ్డు నిర్మాణం కొరకు ఎన్. సునీత గ్రామసర్పంచ్ దరఖాస్తు చేసారు.
ముంచింగిపుట్టు మండలం పెదగుడ పంచాయతి పెదగుద గ్రామస్తుడు వారి అబ్బాయి తమిక్యమనిత్ సికిల్ సెల్ అనేమియా ట్రీట్మెంట్ అయ్యిందని ప్రభుత్వం వారు మంజూరు చేసిన పది వేల రూపాయలు ఖాతాలో జమ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసారు .
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు పి.బి. పరిమళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్ బి ఎస్ నంద్, డిఆర్డిఎ పిడి వి మురళీ, రహదారులు భవనాల శాఖ ఈఈ బాల సుందర బాబు, గ్రామ వార్డ్ సచివాలయ నోడల్ ఆఫీసర్ పి ఎస్ కుమార్, డిపివో కె.పి. చంద్ర శేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి విశ్వేశ్వర నాయుడు, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి ఎ జయప్రకాష్ పలువురు తాహాసిల్దార్లు తదితరులు ఉన్నారు.
0 Comments