ఈ నెల 6న స్వచ్ఛాంధ్రా అవార్డుల ప్రధానం___ జిల్లాకు 38 అవార్డులు - జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్

ఈ నెల 6న స్వచ్ఛాంధ్రా అవార్డుల ప్రధానం
అల్లూరి జిల్లాకు ఒక రాష్ట్ర స్థాయి 38 జిల్లా స్థాయి అవార్డులు

 కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడి

అల్లూరి జిల్లా, పాడేరు అక్టోబర్ 02(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : వ్యాప్తంగా నిర్వహించిన స్వచాంధ్రా అవార్డులు 2025 పోటీలలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఒక రాష్ట్ర స్థాయి అవార్డు మరియు 38 జిల్లా స్థాయి అవార్డులు సాధించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.యస్.దినేష్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వచ్ఛంద్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద రాష్ట్ర/జిల్లా స్థాయిలలో తొలిసారిగా సమగ్ర పరిశుభ్రతా సర్వే నిర్వహించి, ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణ , ప్రజోపయోగ ప్రదేశాల పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నిషేధం, రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ పద్ధతుల స్థిరమైన ఆచరణలో విశిష్ట ప్రతిభ కనబరచిన సంస్థలకు/వ్యక్తులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవార్డులు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయిలలో పరిశుభ్ర ప్రభుత్వ కార్యాలయాలుగా పాడేరు ఐటిడిఎ కార్యాలయం, రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయం మరియు అరకు మండల పరిషత్ కార్యాలయాలు అవార్డులు సాధించినట్లు తెలియచేశారు. 

మరియు 
స్వచ్ఛ గ్రామాల కేటగిరిలో. 05
స్వచ్ఛ అంగన్వాడీ కేటగిరిలో. 05 
స్వచ్ఛ బస్ స్టేషన్లు కేటగిరిలో. 01 
స్వచ్ఛ ఆసుపత్రులు కేటగిరిలో.03 
స్వచ్ఛ పాఠశాలలు కేటగిరిలో 06, 
స్వచ్ఛ రైతుబజార్లు కేటగిరిలో 01 
స్వచ్ఛ హాస్టల్స్ కేటగిరీలో 02
స్వచ్ఛ గ్రామైఖ్య సంఘాలు. 05
పారిశుధ్య సిబ్బంది కేటగిరిలో 04 
స్వచ్ఛంద సంస్థల కేటగిరిలో 03 

మొత్తం 38 జిల్లా స్థాయి అవార్డులతో పాటు అల్లూరి జిల్లా డుoబ్రిగూడ మండలం కించుమండ పంచాయతీలో క్లాప్ మిత్రాగా పనిచేస్తున్న ఏ .మల్లేశ్వర రావుకు రాష్ట్ర స్థాయి అవార్డు లభించినట్లు తెలిపారు .
అవార్డుల ప్రకటన కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి కుమార్ పాల్గొన్నారు.

ఈ నెల 6 వ తేదీన జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి శ్రీమతి గుమ్మడి, సంధ్యారాణి గారు ముఖ్య అతిథిగా నిర్వహించబోవు జిల్లా స్థాయి వేడుకలో అవార్డులు ప్రధానం మరియు అవార్డ్ గ్రహీతలకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

Post a Comment

0 Comments