38 ప్రాథమిక నర్సరీ కేంద్రాలు గుర్తింపు
2026-27 నాటికి పదివేల ఎకరాలలో కొత్త కాఫీ తోటలు లక్ష్యం
కాఫీ బోర్డ్ లైజన్ వర్కర్లకు నా అభినందనలు
ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీ పూజ
పాడేరు అక్టోబర్ 6 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): బెర్రీ బోర్ చీడపురుగు నిర్మూలనకు రేయి పగలు కష్టపడి పనిచేసినందుకు కాఫీ బోర్డ్ లైజెన్ వర్కర్లకు నా అభినందనలు తెలియజేస్తున్నానని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమని శ్రీ పూజ పేర్కొన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరం నందు కాఫీ బోర్డ్ లైజన్ వర్కర్లతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో 11 మండలాల నుంచి 150 కాఫీ బోర్డు లైజెన్ వర్కర్లు, 17 ఫీల్డ్ కన్సల్టెన్సీ, 6 హార్టికల్చర్ కన్సల్టెంట్, 4 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ లక్ష ఎకరాల్లో కాఫీ తోటను మరియు 75 వేల ఎకరాల పాత తోటల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.
కాఫీ బోర్డు నుంచి కాఫీ విత్తనం సేకరణ, టెండర్స్ ద్వారా పాలిథిన్ సంచులు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు.
38 ప్రైమరీ నర్సరీ కేంద్రాలు గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. 2026-27 నాటికి పదివేల ఎకరాల్లో కొత్త కాఫీ తోట లక్ష్యంగా మరియు 15 వేల ఎకరాలలో పాత కాఫీ తోటలో పునరుద్ధరణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు ఆదేశించారు. లబ్ధిదారులను తొందరగా గుర్తించి నర్సరీలో తయారు చేసిన కాఫీ మొక్కలను పంపిణీ చర్యలు తీసుకోవాలని సూచించారు. చీడపురుగు నిర్మూలానికి ఎలాగైతే కష్టపడి పగలు రేయి పని చేశారు అదేవిధంగా కొత్త ప్రాజెక్ట్ లక్ష్యాన్ని సాధించడంలో సాధించడంలోనే సాధించడంలో కృషి చెయ్యాలని ఆదేశించారు.
నవంబర్ ఫస్ట్ నుండి చేతికి వచ్చే కాఫీ పంట రైతుల నుండి చింతపల్లి మ్యాక్స్ సొసైటీ ద్వారా కాఫీ పండ్ల సేకరించుటకు లైసెన్ వర్కర్స్ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి పి టి జి ఎం వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ కాఫీ బోర్డ్ ఎల్ బొంజయ్య తదితరులు పాల్గొన్నారు.
0 Comments