బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటాం__బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్

బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటాం
బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్

జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్

పాడేరు సెప్టెంబర్ 1(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): గణేష్ నిమజ్జనం సందర్భంగా పాడేరు మండలం చింతలవీధి ప్రమాద ఘటనలో గాయపడి కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ సోమవారం పరామర్శించారు. వి. దాలమ్మ, కొర్ర ఇస్పా లను  కేజీహెచ్ ను సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం నుండి పరిహారం అందించడానికి కృషి చేస్తానని చెప్పారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సూచించారు. బాధితులు త్వరగా కోలుకునే విధంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. అవసరమైతే  శస్త్ర చికిత్సలు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కేజీహెచ్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments