అల్లూరి మన్యం ప్రాంత అభివృద్ధికి చొరవ చూపాలి__శాసన సభాపతి అయ్యన్నపాత్రుడిని కోరిన తెదేపా నేతలు__అరకు పార్లమెంట్ టిడిపి బీసీ సెల్ ఉపాధ్యక్షుడు నాగభూషణం

అల్లూరి మన్యం ప్రాంత అభివృద్ధికి చొరవ చూపాలి
శాసన సభాపతి అయ్యన్నపాత్రుడిని కోరిన తెదేపా నేతలు

అరకు పార్లమెంట్ టిడిపి బీసీ సెల్ ఉపాధ్యక్షుడు నాగభూషణం

చింతపల్లి సెప్టెంబర్ 05 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు చొరవ చూపాలని చింతపల్లి మండల తెదేపా నేతలు కోరారు. గురువారం ఆయన జన్మదినం సందర్భంగా మండలానికి చెందిన తెదేపా నేతలు టిడిపి అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం, గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనంద్ లు నర్సీపట్నం లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి, సాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా అసమర్ధ పాలనలో మన్యం అభివృద్ధి పూర్తిగా వెనుకబడిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్నాయని అన్నారు. ప్రస్తుతం మన్యం ప్రాంతంలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సభాపతికి వివరించారు. లంబసింగి వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు సరైన వసతుల లేమితో వెనుకబడుతున్నాయని, చింతపల్లి, జీకే వీధి, నర్సిపట్నం మండలాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సదుపాయాలు తక్షణం మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటి, టూరిజం రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు సాగునీరు, మార్కెట్ సదుపాయాలు, రుణమాఫీ వంటి అంశాల్లో ప్రభుత్వం సహకరించాల్సిన అవసరముందని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, శాసనసభ సభాపతి సహకరిస్తే ఏజెన్సీ ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని వారు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పందించిన శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ అల్లూరి ఏజెన్సీ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పరం సహకరించుకుంటే పనులు మరింత వేగవంతం అవుతాయన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రుత్తల సత్యనారాయణ (అర్జున్), స్థానిక కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments