గురుకుల కళాశాలలో ఈగల్ టీమ్ 'డ్రగ్స్ వద్దు బ్రో' కార్యక్రమం___ఈగల్ టీమ్ ఎస్ఐ నాగార్జున

గురుకుల కళాశాలలో ఈగల్ టీమ్ 'డ్రగ్స్ వద్దు బ్రో' కార్యక్రమం
ఈగల్ టీమ్ ఎస్ఐ నాగార్జున 

అల్లూరి జిల్లా, చింతపల్లి సెప్టెంబర్ 01 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): చింతపల్లి ప్రభుత్వ గురుకుల జూనియర్ కళాశాలలో ఈగల్ టీం ఎస్సై డి నాగార్జున ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ ఐజిపి ఆకే రవికృష్ణ ఆదేశాలతో, అల్లూరి జిల్లా ఈగల్ ఎస్పీ కె. నగేష్ బాబు సూచనల మేరకు సోమవారం అల్లూరి జిల్లా గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె. రామేశ్వరం ఆధ్వర్యంలో 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ నాగార్జున మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు  బానిసై విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. గంజాయి సాగు, అక్రమ రవాణా, వ్యాపారం చేసే వారికి సహకరించినా కూడా ఎన్‌డిపిఎస్ చట్టం కింద కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. డ్రగ్స్ కి దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అసాంఘిక కార్యకలాపాలపై, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అలాగే మైదాన ప్రాంతాల నుండి మన్య ప్రాంతాల్లోకి గంజాయి వ్యాపారం కోసం వచ్చే వ్యక్తుల సమాచారం వెంటనే 1972 టోల్‌ఫ్రీ నంబర్‌కు అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఇంకా విద్యార్థులు సైబర్ క్రైమ్‌ వంటి వాటితో అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వాటిపై ఆసక్తి చూపకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఎస్సై వెంకటేశ్వరరావు, ఈగల్ టీమ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments