డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు__కాలేజ్ ఏంథమ్ ఆవిష్కరణ___కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం విజయభారతి

డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
కాలేజ్ ఏంథమ్ ఆవిష్కరణ

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం విజయభారతి

అల్లూరి జిల్లా, చింతపల్లి సెప్టెంబర్ 5 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విజయభారతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్. కృష్ణయ్య, కళాశాల విశిష్ట చరిత్రను తెలియజేసేలా ఒక గీతాన్ని (పాటను) రచించారు. ఈ గీతం (కాలేజ్ ఏంథమ్) సీడీని కళాశాల ప్రిన్సిపాల్, గీత రచయిత ఎన్. కృష్ణయ్య చేతుల మీదుగా అధ్యాపకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ విజయభారతి మాట్లాడుతూ, ఈ కళాశాల గీతం ఇంత గొప్పగా రావడానికి సహకరించిన చీఫ్ కోఆర్డినేటర్ కే.వి. మురళీకృష్ణ, గీత రచయిత ఎన్. కృష్ణయ్య, గాయకుడు నాగరాజు కడారి (అనిత ఓ అనిత ఫేమ్), మరియు సంగీత దర్శకుడు వి.వి. నాయక్ (హైదరాబాద్) లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యాయ దినోత్సవం అనేది విద్యార్థుల జీవితంలో గురువుల ప్రాముఖ్యతను గుర్తు చేసుకునే ఒక పవిత్రమైన రోజనీ, ఇది ఉపాధ్యాయ వృత్తిలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే వేడుకని అన్నారు. గీత రచయిత ఎన్. కృష్ణయ్య ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, గురువుల గొప్పతనాన్ని, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ప్రాముఖ్యతను వివరించారు. రాధాకృష్ణన్‌ను విద్యార్థులు ఒక మార్గదర్శకునిగా స్వీకరించి, వారిని స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల గ్రంధాలయ అధికారి తాంగుల జగత్ రాయ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Post a Comment

0 Comments