ప్రభుత్వం అందించే ఎరువులు, విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి__చింతపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ దురియా పుష్పలత

ప్రభుత్వం అందించే ఎరువులు, విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
చింతపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ దురియా పుష్పలత

అల్లూరి జిల్లా, చింతపల్లి సెప్టెంబర్ 5(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : రైతులు ప్రభుత్వం అందిస్తున్న ఎరువులు, విత్తనాలను సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడి సాధించాలని చింతపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ దురియా పుష్పలత అన్నారు. శుక్రవారం చింతపల్లి-2 సచివాలయం పరిధిలోని రైతు సేవా కేంద్రంలో జరిగిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక కూటమి నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఆమె రైతులకు అవసరమైన ఎరువులు, 90 శాతం సబ్సిడీతో అందించే రాజ్మా విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. రైతులకు కష్టాన్ని, ఆర్థిక భారాన్ని తగ్గించి, పంట దిగుబడులు పెంచుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పడుతుందని ఆమె వివరించారు. ఎరువులు, విత్తనాలను సమయానికి అందించడం వల్ల రైతులు ఎటువంటి ఆందోళన లేకుండా తమ పంటలను సాగు చేసుకోవచ్చని, దీని ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని అన్నారు. రాజ్మా విత్తనాలను దుర్వినియోగ పరచకుండా సేంద్రీయ పద్ధతిలో పండించి నేలకు మేలు చేయడంతో పాటు అధిక దిగుబడి సాధించి లాభాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కృష్ణమూర్తి, అరకు అసెంబ్లీ బీసీ సెల్ అధ్యక్షులు లక్కోజు నాగభూషణం, గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనంద్, తెదేపా నాయకులు చిన ఖాసిం వల్లీ, పిసా ఉపాధ్యక్షులు మోహన్ రావు, కార్యదర్శి బాలకృష్ణ, వైసీపీ సీనియర్ నాయకుడు వేములపూడి పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments