జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్
పాడేరు,సెప్టెంబర్ 02(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ స్పష్టం చేసారు.
మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్సు హాల్లో విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ట్రైబల్ వెల్ఫేర్, స్కిల్ డెవలప్మెంట్, ఫుడ్ సేఫ్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలతో అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు.
విద్యాశాఖ, ఇంటర్ మీడియట్, సర్వశిక్ష అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రాప్ అవుట్లును గుర్తించి పాఠశాలలో చేర్పించాలని చెప్పారు . మండల విద్యాశాఖా అధికారులు పూర్తి స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ కి హాజరు కాకపోవడంపై, పనితీరు సంతృప్తికరంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో పర్యటించి రానున్న 15 రోజుల్లో పాఠశాలాల్లో విద్యార్థులను భర్తీ చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అలాగే ఆధార్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. నేటికీ తల్లికి వందనం డబ్బులు పడని వారికి సంబందించిన సమస్యలు పరిశీలించి, డేటా సరి చేసి తల్లికి వందనం పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటర్ మీడియట్ విద్యకు సంబందించిన లెక్చరర్లు స్టేటస్, అలాగే ఇంటర్ మీడియట్ ఫలితాల శాతంపై ఆరాతీశారు.
ప్రభుత్వం నిర్దేశించిన పురోగతి లక్ష్యాలను అధిగమించాలని చెప్పారు. విద్యారంగంలో పురోగతి సాధించాలని చెప్పారు. విద్యా సంస్థలకు తాగునీరు, విద్యుత్తు, అదనపు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. పాఠశాలల్లో బేస్ లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని సంబందిత డేటాను సక్రమంగా సంబంధిత పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. బాల్య వివాహల నివారణ పై దృష్టి సారించాలని, గర్భవతులు రిజిస్ట్రేషన్ పక్కాగా జరగాలని అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖల పనితీరును సమీక్షించి తగు సూచనలు అందజేశారు. అంగన్వాడీలు పనితీరు మరింత మెరుగు పరచాలన్నారు, గ్రామస్థాయిలో సర్వే త్వరిత గతిన చేసి విభిన్న ప్రతిభా వంతులకు సదరం సర్టిఫికెట్స్ అందించేలా కావలసిన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం వైద్య ఆరోగ్య, స్కిల్ డెవలప్మెంట్, ఫుడ్ సేఫ్టీ సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ్, రంపచోడవరం, చింతూరు ప్రాజెక్ట్ అధికారులు కె. సింహాచలం, అపూర్వ భరత్, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్, (వర్చువల్), పాడేరు కలెక్టరెట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి విశ్వేశ్వర నాయుడు, ముఖ్య ప్రణాళికాధికారి పి.వి.ఎల్.ప్రసాద్ జిల్లా విద్యాశాఖధికారి పి.బ్రాహ్మజీ, విభిన్న ప్రతిభా వంతులు హిజ్రాలు మరియు వయోవృద్దుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు కె.కవిత, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి ఝాన్సీ రామ్ పడాల్, సర్వశిక్ష ఎపిసి డా. స్వామి నాయుడు పాల్గొన్నారు.
0 Comments