పేదల సంక్షేమం, ఆర్ధికాభివృద్దే కూటమి లక్ష్యం__జనసేన నాయకుడు కూడ రామకృష్ణ

పేదల సంక్షేమం, ఆర్ధికాభివృద్దే కూటమి లక్ష్యం
జనసేన నాయకుడు కూడ రామకృష్ణ

అల్లూరి జిల్లా, ​చింతపల్లి సెప్టెంబర్ 1(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : పేదల సంక్షేమం మరియు ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని జనసేన నాయకుడు కూడ రామకృష్ణ అన్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే ఆయన స్థానిక కూటమి నాయకులు, అధికారులతో కలిసి మండలంలోని పెదబరడ పంచాయతీ పరిధిలోని లోతుగడ్డ జంక్షన్, చిన్నబరడ, సిరిపురం గ్రామాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ​ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ నగదును అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ నెలకు రూ.4,000 చొప్పున పెన్షన్ అందిస్తుందని అన్నారు. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ​అర్హులైన వికలాంగులందరికీ పెన్షన్లు అందుతున్నాయని, వాటిని తొలగిస్తున్నారనే వదంతులను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. ఏ ఒక్కరి పెన్షన్ కూడా తొలగించలేదని, అందరికీ సకాలంలో పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల మేలు కోరే ప్రభుత్వమే తప్ప కీడు చేసేది కాదని ఆయన అన్నారు. ​ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బిజేపి నాయకులు శ్రీనుబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెన్న కేశవ, ఉల్లి బాలయ్య, శివదేవ ఎంపీటీసీ లోవరాజు, లోతుగడ్డ జంక్షన్ గ్రామస్తులు పిండి రాజుబాబు, రుత్తల శ్రీను, రొంగళి సూరిబాబు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments