సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్..
మహిళా పక్షపాతి కూటమి ప్రభుత్వం....
హామీల అమలులో సఫలం చేసిన కూటమి ప్రభుత్వం...
ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి ఎం. శిరీష దేవి విజయ్ భాస్కర్,
అల్లూరి జిల్లా, రంపచోడవరం సెప్టెంబర్ 3 (సుంకరి ఆనంద్, రంపచోడవరం స్టాఫ్ రిపోర్టర్) : కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ ఎం. శిరీషదేవి విజయ్ భాస్కర్ అన్నారు. రాజవొమ్మంగి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ప్రాంగణంలో బుధవారం స్త్రీ శక్తి పధకంలో మహిళలలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమం విజయోత్సవ సభను మండల కార్యదర్శి ఎం. కేశవ్ అధ్యకతన నిర్వహించారు. ఈ సందర్బంగా
తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు తక్కువ కాలంలో
పారదర్శకంగా అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందిoదన్నారు. ముఖ్యంగా
మహిళల పట్ల తమ ప్రభుత్వానికి అమోఘమైన సదభిప్రాయం ఉందన్నారు. ఈ క్రమంలో మహిళలు కొరకు మన ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పధకాల్లో ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తుంద న్నారు. దీనిలో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా దీపం పధకంలో సంవత్సరానికి మూడు గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తున్నామన్నారు. అలాగే తల్లికి వందనం పధకంలో భాగంగా చదువుతున్న ప్రతి విద్యార్థి, విద్యార్థినుల తల్లుల బ్యాంకు ఖాతాలో రూ. 13000/-లు చొప్పున వేసిన ఘనత తమదన్నారు. అన్నదాత సుఖీభవ పధకంలో రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో మొదటి విడతగా రూ. 7000/-లు జమచేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మహిళలు కోసం ఇచ్చిన స్త్రీ శక్తి పధకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి మహిళల మోముల్లో ఆనందోత్సవాలు నింపిన చరిత్ర కూటమి పార్టీకే చెల్లిందన్నారు. ప్రస్తుతం ఉచిత బస్సు పధకంలో భాగంగా ఇప్పటికే రోజుకి 18 లక్షల మంది మహిళలు దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. మహిళలు ఈ పధకం ద్వారా చాలా ఆదా పొందుతున్నారని పేర్కొన్నారు. ఉచితబస్సు పధకం పై క్షుణ్ణంగా వివరించారు. మహిళలకు త్వరలో ఈ పధకం లబ్ధిపొందేలా స్మార్ట్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. అలాగే నిరుద్యోగులు కొరకు DSC నియామకం చేపట్టినవిధానం పై వివరించారు. రాష్ట్రానికి తీసుకువఛ్చిన పరిశ్రమలు మరియు మహిళలు అందరూ పారిశ్రామిక వేత్తలుగా చేసే బృహత్తర ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. మహిళామూర్తుల కోసం ప్రత్యేకంగా రాయితీలు అందిస్తుంది కూటమి ప్రభుత్వం అన్నారు. సామాజిక ఫింఛన్లు గత ప్రభుత్వం కంటే ఎక్కువగా పెంచి మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే సంక్షేమ పధకాలు అందని వారిపై ప్రత్యేక చర్యలు తీసుకుని వారిని ఆయా సచివాలయాల్లో మరలా దరఖాస్తు చేసుకుంటే లబ్ధిపొందేలా చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే తాను స్వంతంగా తన ఆర్థిక వనరులతో చేసిన పలు మేలుకరమైన సేవలు పై వివరించారు. అసత్య ప్రచారాలు చేసే ప్రతిపక్షం పార్టీ పై నిప్పులు కురిపించారు. నియోజకవర్గం పార్టీ పరిశీలకులు కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ మహిళలు కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పధకాలు కోసం క్షుణ్ణంగా వివరించారు. అలాగే కొందరు మహిళా లబ్ధిదారులు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పధకాలపై స్వీయ అనుభూతిని వ్యక్త పరిచి ఆనందం వ్యక్తపరిచారు. అలాగే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ముందుకు సాగేలా చేస్తున్న కూటమిప్రభుత్వం పై అభినందనలు వర్షం కురిపించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ లోతా లక్ష్మణరావు,, మండలం పార్టీ నాయకులు గొల్లపూడి పెద్దిరాజు, క్లస్టర్ ఇంచార్జి ముప్పన కేశవ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఈరోజి స్వప్న కుమారి, మాజీ సొసైటీ అధ్యక్షులు గణజాల తాతారావు, ఎంపీటీసీ సత్తిబాబు, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు ముప్పన సావిత్రి, AMC డైరెక్టర్లు జి. మాణిక్యం, కేసిరెడ్డి శివ, తెదేపా మండల నాయకులు మాకాడ బుల్లమ్మ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పప్పుల బాలమ్మ, కార్యదర్శి సాగిన దేవి, కోశాధికారి కోసూరి లక్ష్మి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కె.వరలక్ష్మి, రాజవొమ్మంగి సర్పంచ్ గొల్లపూడి రమణి, అడ్డతీగల PACS అధ్యక్షులు బూర్లె హరిబాబు, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు వై. నిరంజనీదేవి, మాజీ ఎంపీపీలు ప్రభ, రెడ్డి రమణ, మాజీ ఎంపీటీసీలు డి. చిన్నతల్లి, సావిత్రి, మాజీ సర్పంచ్ కోపూరి రత్నం,
జనసేన మండల అధ్యక్షులు బొదిరెడ్డి త్రిమూర్తులు, భాజపా మండలం అధ్యక్షులు తాము సూరిబాబు, మారిశెట్ల వెంకటేశ్వరరావు, సుమారు నాలుగు వేల మంది మహిళలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments