శుక్రవారం ఎంప్లాయిస్ గ్రీవెన్స్
జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్
పాడేరు, సెప్టెంబరు 18 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): సెప్టెంబర్ 19వ తేదీ శుక్రవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3.00 గంటల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని,
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపారు. ఉద్యోగులు తమ సమస్యలపై ఈ గ్రీవెన్స్‌లో ధరఖాస్తులను అందజేయవచ్చునని సూచించారు. ఇకనుంచీ ప్రతీనెలా 3వ శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
0 Comments