సమయపాలన పాటించి సకాలంలో వైద్యం అందించాలి__సహాయ కలెక్టర్ సాహిత్

సమయపాలన పాటించి సకాలంలో వైద్యం అందించాలి
సహాయ కలెక్టర్ సాహిత్

పాడేరు, సెప్టెంబర్ 03(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): సమయపాలన పాటించి సకాలంలో వైద్యం అందించాలని పాడేరు సహాయ కలెక్టర్ సాహిత్ అన్నారు.
బుధవారం సహాయ కలెక్టర్ సాహిత్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి విశ్వేశ్వర నాయుడుతో కలసి పాడేరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సందర్శించారు. పర్యటనలో రోగుల విభాగం, రోగుల విభాగంలో కాసులాలిటీ, అత్యవసర కేసులు, వార్డులు - మెడికల్, సర్జికల్, గైనెక్ డిపార్ట్మెంట్ సందర్శించారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత అవసరం అన్నారు. అలాగే రోగులకు మందులు అందజేశారు. ప్రయోగశాల, ఎక్స్రే, స్కాన్ సెంటర్లు పనితీరు పరిశీలించారు. అలాగే ఆసుపత్రి - డెలివరీ రికార్డులు పరిశీలించారు. రెఫరల్ సర్వీస్, అంబులెన్స్ సేవలు పై ఆరాతీశారు.
ఈ పర్యటనలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. హేమలతా దేవి, గైనకాలజస్ట్ డా. నరసింగ రావు,  వివిధ విభాగల హెచ్ఓడిలు ఉన్నారు.

Post a Comment

0 Comments