చింతపల్లి, సెప్టెంబర్ 17( స్టాప్ రిపోర్టర్ పాంగి సురేష్ కుమార్ ): నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం బుధవారం బాధ్యతలు స్వీకరించనుంది. ఉదయం 11 గంటలకు టిడిపి శ్రేణులతో చింతపల్లి హనుమాన్ జంక్షన్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు భారీ ర్యాలీగా వెళ్ళనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ప్రారంభం కానుంది. చైర్ పర్సన్ కిలో ఊర్మిళ, వైస్ చైర్మన్ రొబ్బ హశ్వంత్ తో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పాడేరు టిడిపి నియోజకవర్గం ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి, విశిష్ట అతిథులుగా బిజెపి నేత కూడా కృష్ణారావు, జనసేన నేత బొంపూరు గంగులయ్య హాజరు కానున్నట్టు టిడిపి మండల అధ్యక్షుడు కిల్లో పూర్ణచంద్రరావు తెలియజేశారు.
0 Comments