ఉప ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
అన్ని శాఖలు సమన్వయంతో విధులు నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్
పాడేరు, సెప్టెంబర్ 03(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): 5వ తేదీ, శుక్రవారం మాడగడ గిరిజన గ్రామానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ అన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీ మండలం, మాడగడ గిరిజన గ్రామాన్ని సందర్శిస్తారు. మాడగడ గ్రామస్తులు నిర్వహించుకునే ఆదివాసీ సంప్రదాయ ఉత్సవం ‘బలి పొరోబ్’ లో పాల్గొంటారు. మాడగడ గ్రామ పంచాయతీ పరిధిలో 12 రోజులపాటు నిర్వహించే బలి పొరోబ్ ఉత్సవాలు గత నెల 25వ తేదీన ప్రారంభం అయిందన్నారు.
పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లుపై జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్,
పాడేరు సబ్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్, సహాయ కలెక్టర్ సాహిత్ తో కలసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. కొత్త బలిగూడ గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం, బ్యారికెట్ల ఏర్పాట్లు పై పలు సూచనలు అందించారు. రచ్చబండ ఏర్పాట్లు చేయాలన్నారు. ఉప ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఏర్పాట్లలో ఏమైనా సమస్యలు ఉంటే జాయింట్ కలెక్టర్ ని సంప్రదించాలన్నారు. రోప్ పార్టీ ఏర్పాటు చేయాలన్నారు. పరిసరాలు పరిశుభ్రం చేయాలన్నారు. ఉప ముఖ్యమంత్రి ముందుగా రచ్చబండ దగ్గరకి వస్తారని, అక్కడి నుండి బలిపాడు చెరువు దగ్గరికి చేరుకుంటారన్నారు. జిల్లా ఎస్ పి మాట్లాడుతూ వాహనాల పార్కింగ్, బందోబస్తూ, రోప్ పార్టీ ఏర్పాట్లు వివరించారు.
0 Comments