పాడేరు ‘చలో మెడికల్ కాలేజ్’ ఉద్యమానికి వైసీపీ శ్రేణుల పిలుపు

పాడేరు ‘చలో మెడికల్ కాలేజ్’ ఉద్యమానికి వైసీపీ శ్రేణుల పిలుపు


భారీ ప్రదర్శనకు పార్టీ నేతల మద్దతు


వైయస్సార్ పార్టీ యూత్ అధ్యక్షులు గబ్బాడి శేఖర్


చింతపల్లి, సెప్టెంబర్ 17 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రయివేటికరణను వ్యతిరేఖిస్తూ చలో మెడికల్ కాలేజ్ ఉద్యమానికి సిద్ధమవుతున్నామని వైకాపా యూత్ అధ్యక్షులు గబ్బాడి శేఖర్ తెలిపారు. పాడేరు మెడికల్ కాలేజ్‌ను పూర్తిస్థాయిలో ప్రారంభించాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 19 శుక్రవారం న చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉద్యమానికి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ఉద్యమం కొనసాగుతోందని తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ప్రతి ఒక్కరు మద్దతివ్వాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు, జడ్పీటీసీలు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీ సభ్యులు అనుబంధ విభాగాల నాయకులు

యువత, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఇది సాధారణ నిరసన కాదని, ప్రజల హక్కుల కోసం నడిపే ఒక ఉద్యమం ఆయన పేర్కొన్నారు. వైసీపీ పార్టీ అభిమానులు పార్టీ శ్రేయోభిలాషులు ప్రజలతో కలిసి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి అందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments