సామాజిక పింఛన్ల పెంపుతో ఆర్థిక భరోసా
అంజలి శనివారం వైస్ సర్పంచ్ ఉత్తర కుమారి
అల్లూరి జిల్లా, చింతపల్లి సెప్టెంబర్ 1(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లను పెంచి వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు అండగా నిలుస్తోందని అంజలి శనివారం ఉప సర్పంచ్ కె. ఉత్తర కుమారి అన్నారు. మండలంలోని అంజలి శనివారం పంచాయతీ పరిధిలోని చిన్నయ్యపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించి వారిని ఆర్థికంగా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సామాజిక పింఛన్లను రూ. 4,000కు పెంచింది మన కూటమి ప్రభుత్వమని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఇలా సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఈ పింఛన్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదనీ, ప్రజలకు భరోసా కల్పించే చర్యని ఆమె పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆమె కొనియాడారు. ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి వారికి అండగా నిలిచారని, అందుకే రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంచుతున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇంచార్జి కే. పరమేశ్వర రావు, గ్రామ ఉపాధ్యక్షులు లకే రామస్వామి, నారాయణ రావు, రాజకుమార్, రమణ బాబు, శ్రీను, వెంకటేశ్వర్లు, రాజారావుతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
0 Comments