అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 21(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : తమ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఎప్పటికైనా తగిన గుర్తింపు వస్తుందని కార్యకర్తలకు భరోసానివ్వడంలో టిడిపి పార్టీ ముందే ఉంటుందని టిడిపి నాయకత్వం మరోసారి నిరూపించింది. ఆ క్రమంలో పార్టీలో చేరిన నాటి నుండి స్వలాభం మరిచి పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేసిన సుర్ల అప్పలకొండను చింతపల్లి అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్‌గా నియమించింది పార్టీ అధిష్టానం. ఈ సందర్భంగా అప్పలకొండ మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉండే పాడేరు నియోజకవర్గ ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు గోవింద్ మాస్టర్ చూపిన విశ్వాసానికి కృతజ్ఞుడినై ఉంటానని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారంలో ముందుండి పని చేస్తానని, ప్రాంతీయ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు. ఆయన నియామకంపై స్థానిక టిడిపి శ్రేణులు, రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
0 Comments