12న డీ వార్మింగ్ డే విజయవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పోస్టర్ ను అధికారులతో కలిసి ఆవిష్కరిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్
అల్లూరి జిల్లా, పాడేరు ఆగస్టు 7 (సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): ఈ నెల 12వ తేదీన జరిగే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. విద్యార్థులందరికీ అల్బెండజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేయాలని అన్నారు.
గురువారం లగిసిపల్లి గ్రామంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పోస్టర్లను జిల్లా కలెక్టరు విడుదల చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు మందుల పంపిణీ జరగాలని సూచించారు. రక్తహీనత నివారణకు నులిపురుగులు నివారణ ఆవశ్యకత ఉందని గుర్తించాలని అన్నారు. నులి పురుగుల వలన రక్త హీనత, పోషకాల లోపం, ఆకలి మందగించటం, నీరసం, ఆందోళన, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయన చెప్పారు. ఆల్ బెండజోల్ మాత్ర వేయడం ద్వారా రక్త హీనత నివారణ, పోషకాలు గ్రహించడం జరుగుతుందని తద్వారా ఏకాగ్రత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి మాత్రలను వేయించాలని, 12వ తేదీన మాత్రలు తీసుకొని పిల్లలకు 20వ తేదీన విధిగా అందించాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఎస్పీఅమిత్ బర్దార్ , జెసి అభిషేక్ గౌడ, అదనపు ఎస్ పి ధీరజ్ తదితరులు ఉన్నారు.
0 Comments