పోస్టర్ అడాప్షన్ గోడ పత్రికలను విడుదల చేసిన జాయింట్ కలెక్టర్
పాడేరు, ఆగష్టు 22 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : పిల్లల దత్తత అంశంలో నిబందనలు అనుసరించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె.అభిషేక్ గౌడ ఆదేశించారు. పిల్లల దత్తత అంశానికి సంబంధించి మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫోస్టర్ అడాప్షన్ కేర్ పోస్టర్లను శుక్రవారం ఐ.టి.డి.ఏ, మీటింగ్ హాల్ లో జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించి, ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని ఆరేళ్లు పైబడి 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను రెండేళ్ల పాటు పెంచి ప్రేమానురాగాలు పంచిన అనంతరం శాశ్వత దత్తత కల్పించాలన్నారు. కార్యక్రమంలో పాడేరు సబ్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, జిల్లా విద్యాశాఖ అధికారి టి. బ్రహ్మాజీ, డి.ఎల్.పి.ఓ. పి.ఎస్.కుమార్, డి.సి.పి.ఓ డా.టి. సద్దు తదితరులు ఉన్నారు.
0 Comments