మార్గదర్శులను గుర్తించి బంగారు కుటుంబాల దత్తత వేగవంతం చేయాలి___జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్

మార్గదర్శులను గుర్తించి బంగారు కుటుంబాల దత్తత వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్

పాడేరు, ఆగష్టు 30 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): మార్గదర్శులు, బంగారు కుటుంబాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ అన్నారు.
శనివారం కలెక్టరెట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి జిల్లా కలెక్టర్   అందరూ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ లు, మండల స్పెషల్ ఆఫీసర్ లు, ఎంపిడిఓ లు, తహశీల్దార్లతో, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు వరకూ నమోదైన మార్గదర్శులు, బంగారు కుటుంబాల వివరాలపై మండలాల వారీగా ఆరాతీశారు. 
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటికీ జిల్లాలో 352 సచివాలయాలకు గాను 329 సచివాలయాలు కవర్ అయ్యాయని, అందులో 16,050 కుటుంబాలకు సంబంధించి 1,24,557 మందికి P4 కింద దత్తత చేసుకోవడం జరిగిందన్నారు.  డుంబ్రిగూడ, ముంచింగ్ పుట్,  మండలంలో పురోగతి బాగులేదని వేగవంతం చేయాలన్నారు. మండలం స్థాయిలో మండలం ప్రత్యేక అధికారి పూర్తి భాద్యతలు వహించాలన్నారు. మండలం ప్రత్యేక అధికారి మండలం అధికారులు అందరితో ముఖంగా ఎంపిడిఓ, తహసీల్దార్, మండల ఎడ్యుకేషన్ అధికారులు, మండల వ్యవసాయ అధికారుల తో సమావేశాలు నిర్వహించాలాన్నారు. కొన్ని మండలాల్లో  పురోగతి లేదన్నారు. మండల ప్రత్యేక అధికారి, తహసీల్దారులు, మండల అభివృద్ధి అధికారులు సమన్వయంతో మార్గదర్శులను గుర్తించి బంగారు కుటుంబాలకు దత్తత కార్యక్రమాలు టార్గెట్స్ పెట్టుకొని పనులు వేగవంతం చేయాలన్నారు.  మండల ప్రత్యేక అధికారులు దృష్టి సారించి వేగవంతం చేయాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ కి జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ్, రంపచోడవరం, చింతూరు ప్రాజెక్ట్ అధికారులు కె. సింహాచలం, అపూర్వ భరత్, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్, పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, జిల్లా P4 ప్రత్యేక అధికారి మరియు ప్రత్యేక ఉప కలెక్టర్ ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు, పాడేరు కలెక్టరెట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి  డిఆర్డిఎ పిడి వి మురళీ, డ్వామా పిడి విద్యాసాగర్, ముఖ్యప్రణాళికాధికారి పి.వి.ఎల్.ప్రసాద్, రహదారులు భవనాల శాఖ ఈఈ బాల సుందర బాబు, డివిజనల్ పంచాయతీ అధికారి పిఎస్ కుమార్  పలువురు తాహాసిల్దార్లు తదితరులు ఉన్నారు.

Post a Comment

0 Comments