పాడేరు ఆగస్టు 25 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): పలువురికి ఆదర్శంగా నిలుస్తూ జిల్లా కలెక్టర్ ఎ. ఎన్. దినేష్ కుమార్ నేత్రదానం చేసారు. జిల్లా కలెక్టర్తో పాటు అరకు పార్లమెంటు సభ్యురాలు గుమ్మా తనూజా రాణి, జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి డా. టి. విశ్వేశ్వర నాయుడు నేత్రదాన పత్రాలపై సంతకాలు చేసి జిల్లా వైద్యారోగ్య శాఖాధికారికి అందజేసారు. 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు. టిబి వ్యాదిగ్రస్తులకు వైద్య సేవలకు టోల్ ప్రీ నంబరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 25 నుండి సెప్టెంబరు 8 తేదీ వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతున్నాయన్నారు. మరణించిన అనంతరం మీకిష్టమైన వ్యక్తికి కళ్లదానం చేయాలని కోరారు. ప్రతీ ఒక్కరూ నేత్రదానం చేసి మరొకరి కంటి చూపును అందించాలన్నారు. టిబి వ్యైద్య సేవలకు 08935294080 నంబరు కు ఫోన్ చేసి వైద్య సేవలు పొందాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ, సబ్కలెక్టర్ శౌర్యమన్ పటేల్, అరకు శాసన సభ్యులు రేగం మత్స్యలింగం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. టి. విశ్వేశ్వర నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments