సొసైటీని అభివృద్ధి బాటలో నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
పాడేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ గిడ్డి ఈశ్వరి
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 21(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : పరస్పర సహకార సంఘాలను అభివృద్ధి బాటలో నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాడేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెదేపా పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్ గిడ్డి ఈశ్వరి అన్నారు. గురువారం చింతపల్లి అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఏర్పాటైన సొసైటీ చైర్మన్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆమె రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు గోవింద్ మాస్టర్ తో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చింతపల్లి అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా నియమితులైన గెమ్మెలి అబ్బాయి నాయుడు, డైరెక్టర్ గా నియమితులైన సుర్ల అప్పలకొండకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కారణంగా సొసైటీలు నిర్విర్యానికి గురై రైతులకు రుణాలు, పంట ప్రోత్సాహ నిధులు అందకుండా పోయాయని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో చింతపల్లి అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ నష్టాల బాట పట్టిందని అన్నారు. వారి అసమర్థత వలన ఆ సహకార సంఘానికి సుమారు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లిందని అన్నారు. రైతులతో ఎప్పుడు కళకళలాడే చింతపల్లి అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వారి నిర్లక్ష్యం కారణంగా నేడు పాడుబడిన బంగ్లాల తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో సొసైటీలు అభివృద్ధి బాటలో కొనసాగనున్నాయని ఆమె అన్నారు. నూతనంగా ఎన్నికైన సొసైటీ చైర్మన్ గెమ్మెలి అబ్బాయి నాయుడు మాట్లాడుతూ తనకు ఓటు హక్కు లేని సమయంలోనే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో పార్టీ కోసం తిరిగానని, నమ్మిన పార్టీలో కష్టపడి పని చేస్తే ఏదో ఒక రోజు తగిన గుర్తింపు వస్తుందని దానికి తానే ఒక ఉదాహరణ అని అన్నారు. తనను నమ్మి ఇంతటి స్థానాన్ని అందించిన తెదేపా అధిష్టానానికి, టిడిపి పాడేరు నియోజకవర్గ ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు గోవింద్ మాస్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీని పూర్తిగా అధ్యయనం చేసి అభివృద్ధిలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని, రైతులకు అవసరమైన రుణాల మంజూరుకు ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానన్నారు. ఈ సందర్భంగా పలువురు తెదేపా, కూటమి నేతలు చైర్మన్, డైరెక్టర్లకు పుష్పగుచ్చాలు అందజేసి, దుస్సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి తెదేపా మండల అధ్యక్షుడు కిల్లో పూర్ణచందర్రావు, గ్రామ కమిటీ అధ్యక్షులు రీమల ఆనంద్, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, అరకు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు నాగభూషణం, కొయ్యూరు మండల మహిళా అధ్యక్షురాలు బోనంగి సత్యవతి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గోలి దేవి, చింతపల్లి, జీకే వీధి టీడీపీ మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments