ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యతా ప్రమాణాలు అమలు__జిల్లా కలెక్టర్ ఎ. ఎస్.దినేష్ కుమార్

ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యతా ప్రమాణాలు అమలు

జిల్లా కలెక్టర్ ఎ. ఎస్.దినేష్ కుమార్

పాడేరు ఆగస్టు 25 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : ప్రభుత్వ ఆసుపత్రులలో పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన కార్యాలయంలో జిల్లాలోని మూడు ఐటిడి ఏ ల ప్రాజెక్టు అధికారులు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, అదనపు జిల్లా వైద్యాధికారులతో ఆసుపత్రుల నిర్వహణ, మెరుగైన వైద్య సేవలు లేబర్ రూం, ల్యాబరేటరీలు, క్లినికల్ సేవలు, రోగుల హక్కులు, వైద్య సహాయక చర్యలలో తగిన నాణ్యతలు అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రు నిర్వహణపై జిల్లాలో ఆసుపత్రులు జాతీయ స్థాయి, రాష్ట్రయికి ఎంపిక కావాలన్నారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రి 94.65 శాతం సాధించి జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. గర్భవతులు చిన్నారులు, కౌమారదశ వైద్య సేవలు, కుటుంబ నియంత్రణ, వ్యాప్తి చెందే సామాజిక వ్యాదుల నిరవాణకు మెరుగైన వైద్య సేవలను విధిగా అమలు చేయాలన్నారు. ఆసుపత్రులలో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతలు అమలు చేయడం వలన ఆసుపత్రుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్యాన్నారు. జిల్లాలో మూడు ఆసుపత్రులు జాతీయ స్థాయికి ఎంపకయ్యాయన్నారు. రాష్ట్ర స్థాయిలో 10 ఆసుపత్రులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. జాతీయ స్థాయిలో గంగవరం, డుంబ్రిగుడ, పిడత మామిడి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, చింతూరు కమ్యూనిటీ ఆసుపత్రి ఎంపికయ్యాయని స్పష్టం చేసారు. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో పాడేరు ఐటిడి ఏ పి ఓ డా. ఎం. జె. అభిషేక్ గౌడ, రంపచోడవరం పి ఓ కె. సింహాచలం, చింతూరు పి ఓ అపూర్వ భరత్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డా. టి. విశ్వేశ్వర నాయుడు, పలువురు అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments