నిర్మాసితులను కాలనీలకు తరలింపుకు తగిన ఏర్పాట్లు___జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్

నిర్మాసితులను కాలనీలకు తరలింపుకు తగిన ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ 

పాడేరు ఆగస్టు 30 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): పోల వరం ప్రాజెక్టు నిర్మాసితులు పునరావాస కాలనీలకు తరలింపుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయంగా భూములు అందించడానికి భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుండి రంపచోడవరం, చింతూరు డివిజన్ అధికారులు, తాహశీల్దారులు, పోలవరం పరిపాలనాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహంచిరు. రైతులకు ప్రత్యామ్నాయ భూములు సేకరణ, పునరావాసం, పునరేర్పాట్లుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఎన్ని ఎకరాలకు ప్రతిపాదనలు వచ్చాయని అధికారులను ఆరా తీసారు. పునరావాస కాలనీలకు నిర్మాసితులు సందర్శించడానికి పర్యటనా ఏర్పాట్లు చేయాలని అన్నారు. విద్యుత్తు, మంచినీటి సదుపాయాలు సమస్యలు పునరావాస కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. రైతులకు సాగుకు అనుకూలంగా ఉన్న భూములు కేటాయించాలన్నారు. జీలుగు మిల్లి, బుట్టాయ గూడెం, కుక్కనూరు గ్రామాల్లో భూములు సేకరించాలని ఆదేశించారు. ఇందుకూరు పేట గ్రామానికి స్మశాన వాటికకు భూమిని సేకరించాలని చెప్పారు. ఈ సమావేశంలో పోలవరం పరిపాలనాధికారి వి. అభిషేక్, రంపచోడవరం ఐటిడి ఏ పి ఓ కె. సింహచలం, సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్, చింతూరు పి ఓ అపూర్వ భరత్, ప్రత్యేక ఉప కలెక్టర్ అంబేద్కర్, చింతూరు, రంపచోడ వరం డివిజన్ల పరిధిలో పలువురు తాహశీల్దారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments