సెప్టెంబర్ ఒకటవ తేది నుండి పాటశాల విద్యార్ధులకు ఆధార్ నమోదు
ఐటిడిఏ ఇంచార్జి పిఓ, జెసి డా.ఎం. జె. అభిషేక్ గౌడ
పాడేరు ఆగస్ట్ 25 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): విద్యార్ధులకు సెప్టెంబర్ ఒకటవ తేది నుండి పాఠశాల వద్దే ఆధార్ నమోదు చేయాలని ఐటిడిఏ ఇంచార్జి ప్రాజెక్టు అధికారి, జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటిడిఏ కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయం, ఐసిడిఏస్, పిఎంయు అధికారులతో చిన్నారులకు ఆధార్ పత్రాలు జారీపై సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఐదు నుండి ఏడు సంవత్సరాల వయస్సు ఉన్న వారు 21,630 మంది, వయసు పదిహేను నుండి పదిహేడు సంవత్సరాల వయస్సు ఉన్న వారు 10,969 మందికి పిల్లలకు ఆధార్ కార్డులు లేవన్నారు. వచ్చే నెల ఒకటవ తేది నుండి రెండు నెలల్లోగా జిల్లలో ఉన్న పాఠశాల విద్యార్ధులకు ఆధార్ జారీ చేయాలని సూచించారు. పాఠశాల పరిధిలో నెట్వర్క్ సదుపాయం అందకపోతే దగ్గర ఉన్న సచావాలయానికి విద్యార్ధులకు తలరించి ఆధార్ జారీ చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు కనీసం జిల్లా మొత్తం లో 800 విద్యార్ధులకు ఆధార్ జారీ చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మొత్తం చాల సీరియస్ గా తీసుకోని నిర్దేశిత సమయం లో పూర్తి చేయాలని సూచించారు. ఆధార్ నమోదులు లేకపోవడం వల్ల ఇకెవైసిలు పెండింగ్ లో ఉంటున్న అన్నారు. పాఠశాలల వారీగా టార్గెట్ పెట్టుకోమని చెప్పారు . యంఆర్ఒలు, యంపిడిఒలను పరివేక్షణ చేయాలని ఆదేశించారు. ఆధార్ ఆపరేటర్స్ కు ఈ ప్రక్రియ పై అవగాహనా కల్పించాలన్నారు. ఆధార్ నమోదుకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు డబ్బులు చెల్లించాలని, మధ్య వర్తులకు డబ్బులు చెల్లించకూడదన్నారు.
ఈ సమావేశంలో పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎం.వేంకటేశ్వరరావు, గ్రామ వార్డు సచివాలయం నోడల్ అధికారి పి.ఎస్.కుమార్, జిఎస్ డబ్లూ ఎస్ జిల్లా సమన్వయ కర్త కె. సునీల్, పాడేరు సిడిపిఓ జి.శారద దేవి , పిఎంయు ప్రోగ్రాం అధికారి రామ్ గోపాల్ , ఆధార్ కో ఆర్డినేటర్ నాగరాజు తదితరులు పాల్గోన్నారు.
0 Comments