టైఫాయిడ్ టీకా అవగాహన కార్యక్రమానికి సిబ్బంది నియామకం___సూపర్వైజర్లు, మండల కోఆర్డినేటర్లు, ఫీల్డ్ ఆఫీసర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

టైఫాయిడ్ టీకా అవగాహన కార్యక్రమానికి సిబ్బంది నియామకం
సూపర్వైజర్లు, మండల కోఆర్డినేటర్లు, ఫీల్డ్ ఆఫీసర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

అల్లూరి జిల్లా, చింతూరు/రంపచోడవరం ఆగస్టు 26 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదం పొందిన భారత్ బయోటెక్ కంపెనీ ద్వారా సురక్ష పబ్లిక్ హెల్త్ కౌన్సిల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న టైఫాయిడ్ వ్యాక్సినేషన్ అవేర్నెస్ ప్రోగ్రాంలో రంపచోడవరం, చింతూరు డివిజన్లోని 11 మండలాలలో పనిచేసేందుకు ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సొసైటీ అల్లూరి జిల్లా కోఆర్డినేటర్ ఎం. ప్రసన్నకుమారి తెలిపారు. ఓ ప్రకటనలో ఆమె మాట్లాడుతూ కాలంతో సంబంధం లేకుండా పెరుగుతున్న సీజనల్ వ్యాధులతో పాటు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాలకు అవగాహన పరిచే విధంగా అలాగే సురక్ష పబ్లిక్ హెల్త్ కౌన్సిల్ సొసైటీ ద్వారా టైఫాయిడ్ టీకా అవగాహన కార్యక్రమంలో పనిచేసేందుకు 11 మండలాలకు ఇద్దరు సూపర్వైజర్లు, 11 మంది మండల కోఆర్డినేటర్లు, వీరి కింద పని చేసేందుకు నలుగురు (ముగ్గురు మగ, ఒక ఆడ) ఫీల్డ్ ఆఫీసర్ల పోస్టులకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడమైనదని ఆమె తెలిపారు. సూపర్వైజర్, మండల కోఆర్డినేటర్ పోస్టులకు అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ ఉండాలని,  ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు మగ అభ్యర్థులకు ఇంటర్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. అలాగే ఆడ ఫీల్డ్ ఆఫీసర్ కు ఏఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఏఎన్ఎం, ఎంపిహెచ్డబ్ల్యు లలో ఏదో ఒక కోర్సు చేసి ఉండాలన్నారు. సూపర్వైజర్లకు 17 వేలు, మండల కోఆర్డినేటర్లకు 15 వేలతో పాటు ట్రావెల్ అలవెన్స్, ఫీల్డ్ ఆఫీసర్లకు 12వేలు, ట్రావెల్ అలవెన్సులు జీతంగా అందించబడతాయని ఆమె పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు ఈనెల ఆగస్టు 29 వ తేదీన చింతపల్లి మండలంలోని చాడీపేట వీధిలో గల బ్రాంచ్ ఆఫీస్ నందు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని, వివరాలకు 8074249887, 6303643193 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు. రంపచోడవరం, చింతూరు డివిజన్లోని 11 మండలాల నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Post a Comment

0 Comments