జాతీయ లోక్ అదాలతో అధిక కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలి __పాడేరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏ. రాము

జాతీయ లోక్ అదాలతో అధిక కేసులు పరిష్కారమయ్యేలా చూడాలి
పాడేరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏ. రాము

అల్లూరి జిల్లా, పాడేరు ఆగస్టు 30 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : 13 సెప్టెంబర్ 2025 న పాడేరు ప్రధమ శ్రేణి జ్యూడిషల్ కోర్ట్ నందు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్  లో భాగంగా అధిక కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని పాడేరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, ఏ. రాము తెలిపారు. శనివారం  స్థానిక కోర్ట్ ఆవరణంలో పాడేరు, హుకుంపేట, జీ మాడుగుల, పెద్దబయలు, ముంచంగి పుట్టు మండలాల  పోలీసు అధికారులు మరియు న్యాయవాదులు తో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమం లో పాడేరు పోలీస్ స్టేషన్ సీఐ దీనభందు గారు, పాడేరు ఎస్ఐ జిఎల్. సురేష్, జీ మాడుగుల ఎస్ఐ ఎస్.షణ్ముఖ రావు, ముంచింగిపుట్టు ఎస్ఐ  జె రామకృష్ణ, పెదబయలు ఎస్ఐ కే రమణ, హుకుంపేట ఎస్ఐ ఏ సూర్యనారాయణ,  పాడేరు పి & ఈ. ఎస్ఐ పీ లక్ష్మి న్యాయవాదులు, కోర్ట్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గున్నారు.

Post a Comment

0 Comments