ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చర్యలు__జిల్లా కలెక్టర్ ఎ. ఎస్.దినేష్ కుమార్

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చర్యలు
జిల్లా కలెక్టర్ ఎ. ఎస్.దినేష్ కుమార్

పాడేరు ఆగస్టు 25 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : రైతులకు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్టే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎరువులు సమస్యలేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. డిమాండ్ ఆధారంగా సప్లై చేయాలన్నారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నుండి ఎరువుల డీలర్లు, వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన దిశ సమావేశ మందిరంలో డీలర్లు అధిక ధరలకు విక్రయించడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం ఎపిపిలు ఫిర్యాదు చేసారని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఎరువులు రైతులకు సరఫరా చేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో అందుబాటులో ఉన్న ఎరువులు నిల్వలు, ఇంకా ఎంత అవసరం ఉంటుందో వ్యవసాయాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎరువుల సరఫరాపై వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాస్తామన్నారు. గంగవరం మండలానికి చెందిన రైతులు ఎక్కడ నుండి ఎరువులు కొనుగోలు చేస్తున్నారని అడిగి తెలుసు కున్నారు. దేవీ పట్నం, గంగవరం, రంపచోడవరం మండలాలకు ఎరువుల కొరత లేదని అధికారులు వివరించారు. ఎరువుల దుకాణాలను అధికారులు తనిఖీలు చేసి అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఎరువుల సరఫరాపై తాహశీల్దారులు, సబ్ కలెక్టర్లు ప్రతిస్పందన (ఫీడ్ బ్యాక్) రిపోర్టులు సమర్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో జెసి ఐటిడి ఏ పి ఓలు డా. ఎం.జె. అభిషేక్ గౌడ, కె.సింహచలం, సబ్కలెక్టర్ శౌర్యమన్ పటేల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎస్.బి. ఎస్.నంద్, పలువురు వ్యవసాయాధికారులు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments