ఈ పాస్ పరికరాలు పంపిణీ చేసిన జెసి
పాడేరు ఆగస్టు 25 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) :డి ఆర్ డిపో డీలర్లకు ఈ పాస్ యంత్ర పరికరాలను జాయింట్ కలెక్టర్ డా. ఎం జె అభిషేక్ గౌడ సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేసారు. పాడేరు మండలంలో ఉన్న 45 డి ఆర్ డిపోలలో 65 ఏళ్లు నిండిన లబ్దిదారులకు పైలట్ ప్రాజెక్టు కింద ముందుగా ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. రేషన్ పంపిణీని పారదర్శకంగా పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. అంచెలంచెలగా జిల్లా వ్యాప్తంగా ఉన్న డి ఆర్ డిపో డీలర్లకు ఈ పాస్ యంత్రాలను పంపిణీ చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, సివిల్ సప్లైస్ డి. ఎం. వి.మోహనరావు, డిప్యూటీ తాహశీల్దార్ ఓ. ప్రశాంత్ ఈపాస్ టెక్నిషియన్ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments